రాజకీయలకు దూరంగా ఉండటమే కాకుండా దేశంలోని కొందరు రాజకీయ ప్రముఖ నాయకుల పేర్లు కూడ తనకు తెలియవు అంటూ మహేష్ అనేక సార్లు ఇంటర్వ్యూలలో చెపుతూ ఉంటాడు. అయితే అలంటి మహేష్ కోసం ఇప్పడు ఆన్ లైన్ పోలింగ్ జరుగుతూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
Mahesh Babu
అయితే ఈ ఆన్ లైన్ పోలింగ్ ను నిర్వహిస్తున్నది మహేష్ వీరాభిమానులు. మహేష్ సుకుమార్ సినిమాను వదులుకుని అనిల్ రావిపూడికి ఓటు వేయడం మహేష్ అభిమానులకు మంచి జోష్ ను ఇవ్వడమే కాకుండా తమ హీరో మంచి నిర్ణయం తీసుకున్నాడు అంటూ మహేష్ అభిమానులు సంబర పడిపోతున్నారు. 
Mahesh Babu starrer Bharat Anu Nenu resumes shoot today in Hyderabad
ఈనేపధ్యంలో మహేష్ అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించి హీరోయిన్ గా సాయి పల్లవి బాగుంటుందా లేదంటే రష్మిక బాగుంటుందా అన్న విషయమై అభిమానులు ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆన్ లైన్ పోలింగ్ లో మహేష్ అభిమాన సంఘాలు విపరీతంగా పాల్గొంటూ ఓట్లు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu (aka) Mahesh Ghattamaneni
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఆన్ లైన్ పోలింగ్ లో రష్మికకు సాయి పల్లవి కన్నా ఎక్కువ ఓట్లు వస్తున్నట్లు సమాచారం అయితే అనిల్ రావిపూడి మహేష్ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాల ప్రాధాన్యత ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో అనిల్ రావిపూడి ఈ ఆన్ లైన్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని నటన పై పట్టు ఉన్న సాయి పల్లవిని ఎంచుకుంటాడా లేదంటే గ్లామర్ కోసం రష్మిక వైపు వెళతాడా అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: