బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పిరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా.. ఎన్.టి.ఆర్ బందిపోటు దొంగగా కనిపిస్తారని తెలుస్తుంది. 


బాహుబలి ఫార్ములాతోనే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మార్చి 27 రాం చరణ్ బర్త్ డే నాడు సినిమాలో చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అన్నారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచన వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. అలా ఎందుకు అంటే సినిమా పోస్టర్స్ ఇప్పుడే రిలీజ్ చేస్తే అంత బజ్ ఉండదని వెనక్కి తగ్గారట.


ఓ పక్క మెగా ఫ్యాన్స్ చరణ్ బర్త్ డే రోజు ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ లుక్ వస్తుందని ఆశపడుతున్నారు. జక్కన్న మాత్రం ప్లాన్ చేంజ్ చేశాడట. పోస్టర్ కాకున్నా కనీసం స్పెషల్ అప్డేట్ ఏదైనా రివీల్ చేస్తారేమో చూడాలి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత షెడ్యూల్ కలకత్తాలో ప్లాన్ చేశారు.


బాహుబలి సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని రాజమౌళి రీసెంట్ గా ఓ ఈవెంట్ లో అన్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే హీరోయిన్స్ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. త్వరలోనే కథానాయికల విషయంలో ఓ క్లారిటీ వస్తుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: