సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో కన్ ఫ్యూజన్ ఏర్పడింది. ఏప్రిల్ 25న మహర్షి రిలీజ్ అని చెబుతున్నా ఇంకా షూట్ చేయాల్సింది చాలా ఉండటం వల్ల అనుకున్న టైం కు రిలీజ్ కష్టమని అంటున్నారు.


ఏప్రిల్ కాకుంటే మేలో రిలీజ్ చేయవచ్చు కదా అనుకోవచ్చు. మహేష్ బాబుకి మే బ్యాడ్ సెంటిమెంట్ ఆ నెలలో రిలీజైన సినిమాలన్ని మహేష్ కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అందుకే మే నెల అంటే మహేష్ వద్దనేస్తాడు. అలా చూస్తే మహర్షి మే కూడా వాయిదా వేస్తే జూన్ దాకా వెళ్లాల్సి వస్తుంది.


అయితే మహర్షి సినిమా మేకింగ్ అవుట్ పుట్ బాగా వస్తుందని తెలిసి ఈసారి మహేష్ మే నెలలో వచ్చేందుకు రెడీ అవుతున్నాడట. మే నెల ఎంత బ్యాడ్ సెంటిమెంట్ అయినా మంచి కథ మంచి ప్రొడక్షన్ కాబట్టి తప్పకుండా ఈసారి వర్క్ అవుట్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఈరోజు సాయంత్రం దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి మే 9న మహర్షి రిలీజ్ ఎంపున్స్ చేస్తారట.


ఏప్రిల్ నెల మొత్తం చిన్న సినిమాల హడావిడి ఉంది. నాని జెర్సీ, నాగ చైతన్య మజిలి, కాంచన 3, రిలీజ్ అవుతున్నాయి. మే 1న చిత్రలహరి రిలీజ్ అంటున్నారు. అయితే వీటితో మహర్షికి పోటీ కాకున్నా ఏప్రిల్ 10 వరకు షూటింగ్ ప్లాన్ చేశారట. 10 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ కుదరదు కాబట్టి మహర్షి మే కి వాయిదా వేయక తప్పట్లేదట. మంచి సమ్మర్ లో రాబోతున్న మహేష్ మహర్షి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. మే నెలలో మహేష్ సినిమా అంటే సూపర్ స్టార్ స్టామినాకు అసలు సిసలు పరీక్ష అన్నట్టే లెక్క.



మరింత సమాచారం తెలుసుకోండి: