‘బాహుబలి’ సినిమా షూటింగ్ సమయంలో ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి    పబ్లిసిటీ డిజైనర్ వరకు ఎన్నో భాద్యతలు నిర్వహించిన కార్తికేయ ప్రస్తుతం ఎక్కువగా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్పాట్ లో కనిపించడం లేదు అన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కార్తికేయ తన బిజినెస్ లు ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా తన కబడ్డీ జట్టుతో బిజీగా ఉంటున్నాడని వార్తలు రావడంతో ఈసారి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయాలను కార్తికేయ పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
Karthikeya
అయితే ఈవిషయాలు రాజమౌళి సన్నిహితుల దృష్టి వరకు రావడంతో  ఈవార్తలను జక్కన్న సన్నిహితులు ఖండిస్తున్నారు. అంతేకాదు కార్తికేయ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో నిర్వహిస్తున్న కొత్త భాద్యతలకు సంబంధించి లీకులు ఇస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ కుసంబంధించి కీలకమైన క్యాస్టింగ్ షెడ్యూల్ వ్యవహారాలను కార్తికేయ చూస్తున్నట్లు తెలుస్తోంది. 
rajamouli son kartikeya as hero in new movie
ఈసినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన డేట్ల అరెంజ్ మెంట్స్ అన్ని కూడ కార్తికేయ ఇచ్చే సూచనలు బట్టి వ్యవహారాలు  నడుస్తున్నాయి అని తెలుస్తోంది. రామ్ చరణ్ ఎన్టీఆర్ లు ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం బల్క్ గా డేట్లు ఇచ్చేశారు. వారిద్దరితో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ముఖ్య తారాగణం నుండి ఎప్పుడు డేట్లు తీసుకోవాలి వారి డేట్లతో చరణ్ ఎన్టీఆర్ డేట్లను ఎలా ప్లాన్ చేయాలనే కీలక విషయాల పై కార్తికేయ భారీ కసరత్తులు చేస్తునాట్లు సమాచారం. 
Rajamouli's Son, S S Karthikeya To Make His Directorial Debut Soon?
అదేవిధంగా ఈసినిమాకుసంబంధించి బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ తో పాటు హీరోయిన్ అలియా భట్ లను ఈచిత్రంలో నటింపజేసేందుకు కార్తికేయ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడుఅని తెలుస్తోంది. వీరందరికీ ఈసినిమాకు సంబంధించిన పాత్రలను వివరించడంతో పాటు డేట్ల విషయంలో కూడ వారితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.  దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి కార్తికేయ ఒక ప్రొడక్షన్ మేనేజర్ లా మారిపోయి తన కొత్త భాధ్యతలతో రాజమౌళి ఆశ్చర్య పోయేవిధంగా నిర్వహిస్తున్నాడు అని రాజమౌళి సన్నిహితుల నుండి లీకులు వస్తున్నా యి. భవిష్యత్ లో రాజమౌళి కార్తికేయను ఒక దర్శకుడుగా కన్నా ఒక మంచి విజయవంతమైన నిర్మాతగా తీర్చి దిద్దాలని రాజమౌళి ఆలోచనలు చేస్తున్న నేపధ్యంలో కార్తికేయకు ఇలాంటి కొత్త బాధ్యతలు అప్పచెప్పి ఉంటాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: