తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 కి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలు మొదలయ్యాయి.  ముఖ్యంగా బిగ్ బాస్ 2 లో ఇంటి సభ్యుడుగా వచ్చిన కౌశల్  కి బయట ఒక కౌశల్ ఆర్మీ ఏర్పడటం..వారు ఓటింగ్ చేసేదాన్ని బట్టి ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవ్వడం జరిగిందని ప్రచారం కొనసాగింది.  మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ అయ్యారు.  అయితే ఈ మద్య కౌశల్ కి .. కౌశల్ ఆర్మీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే.
Related image
కౌశల్ ఆర్మీ తరఫున సేవా కార్యక్రమాలను అందించడం కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా కౌశల్ చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలో కొన్ని ఛానల్స్ లో కౌశల్ ఆర్మికి కౌశల్ కి మద్య తారాస్థాయిలో డిబెట్ లు జరిగాయి.  తాజాగా  కౌశల్ తీరును తప్పుబడుతూ ఒక పాటను కూడా రిలీజ్ చేశారు.

"అందరూ గొర్రెలే .. " అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై కి చెందిన అరవింద్ అనే వ్యక్తి ఈ పాటను విడుదల చేశాడు.  ఈ పాటలో కౌశల్ కి సపోర్ట్ చేసి మేమంతా గొర్రెలం అయ్యాం అంటూ సాగింది. 'అన్న అనుకుంటే పీఎమ్ కాల్ వస్తది .. సీఎం సీటు వస్తది .. టెన్త్ పాస్ కాకున్నా డాక్టరేట్ వస్తది' అనే వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ రాసిన ఈ పాటపై కౌశల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: