క్రిష్ లాంటి దర్శకుడికి ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు మంచి పేరుంది. అయితే ఏమంటా .. ఎన్టీఆర్ బయో పిక్ తీశాడో ఒక్క సారిగా ఉన్న పరువును పోగొట్టుకున్నాడు. దీనితో తరువాత అతను తోయబోయే సినిమాల మీద పడింది. బాలకృష్ణ వంటి పెద్ద హీరోతో వరుసపెట్టి సినిమాలు చేసిన క్రిష్.. అసలిప్పుడు ఏ సబ్జెక్ట్ టచ్ చేయాలి, ఎవరితో సినిమా చేయాలి, అసలెందుకు సినిమా తీయాలనే ఆలోచనలో పడిపోయారు. అటు బాలీవుడ్ కి వెళ్దామన్నా అక్కడ మణికర్ణిక రూపంలో కంగనా రనౌత్ భయపెడుతోంది.

Image result for krish (director)

సగంలో మణికర్ణికను వదిలేసి వచ్చిన క్రిష్.. సైలెంట్ గా ఉండకుండా "నా బంగారం నా బంగారం" అంటూ రిలీజ్ టైమ్ లో చేసిన అతి ఆయన కొంప ముంచింది. కంగన సహా ఆమె సోదరి.. అందరూ కలసి ఓ రౌండ్ వేసుకోవడంతో బాలీవుడ్ లో కూడా తలెత్తుకోలేని పరిస్థితి. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసి హిట్ కొట్టినా కూడా క్రిష్ కు ఫలితం లేకుండాపోయింది.

Related image

అటు వ్యక్తిగతంగా కూడా క్రిష్ జీవితం ఏమంత బాగాలేదు. పెళ్లి.. ఆ వెంటనే విడాకులతో సతమతమౌతున్నాడు. దీంతో ఈ దర్శకుడు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని సమాచారం. ఒకటి రెండు సినిమా ప్రపోజల్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాడట. ప్రస్తుతానికి కాస్త గ్యాప్ తీసుకోవాలనే ఉద్దేశంలో క్రిష్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హీరోలు, స్టార్ డమ్, బయోపిక్ లు అని పెట్టుకోకుండా తనదైన జానర్ లో మానవ సంబంధాల నేపథ్యంలోనే కొత్త కథ తయారుచేసుకోబోతున్నాడట క్రిష్. ఇతడి నుంచి ప్రేక్షకులు కోరుకునేది కూడా ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: