రాజమౌళి సినిమాలో ఒక చిన్న పాత్ర చేయడానికి అయినా తాను రెడీ అంటూ కోలీవుడ్ టాప్ హీరో సూర్య ఒక ఫంక్షన్ లో ఓపెన్ గా అన్నాడు. అలాంటి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం ఒక బాలీవుడ్ హీరోయిన్ కండిషన్స్ కు ఓకె చెప్పవలసిన పరిస్థితి పరోక్షంగా రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో హీరోల పాత్రతో పాటు మెయిన్ హీరోయిన్ పాత్రకు చాల ప్రాధాన్యత ఉంది అని తెలుస్తోంది. దీనితో ఈ మెయిన్ హీరోయిన్ పాత్రను బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ చేత నటింప చేస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి పెద్దగా కష్టపడకుండానే బాలీవుడ్ లో మంచి క్రేజ్ వస్తుంది అన్నది జక్కన్న వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా రాజమౌళి ఒకటికి రెండు సార్లు అలియా భట్ తో తన కొడుకు కార్తికేయ ద్వారా చేస్తున్న రాయబారాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

‘రాజీ’ ‘గల్లీ భాయ్’ ‘ఉడ్తా పంజాబ్’ మూవీల ఘన విజయానికి అలియా భట్ అద్వితీయ నటన ప్రధాన కారణం అన్న అభిప్రాయం రాజమౌళికిఉంది. అందువల్లనే ‘ఆర్ ఆర్ ఆర్’ మెయిన్ హీరోయిన్ గా అలియా భట్ ను ఎంపిక చేయాలి అన్న స్థిర నిర్ణయంలో రాజమౌళి ఉన్నాడు. దీనికోసం అలియా భట్ తో చేస్తున్న రాయబారాలు ఒక సున్నిత విషయం దగ్గర ఆగిపోతున్నట్లు సమాచారం.
Alia Bhatt,actress Alia Bhatt,Alia Bhatt at Zee Cine Awards,Alia Bhatt at Zee Cine Awards 2017,Fair and Lovely Zee Cine Awards 2017,Zee Cine Awards 2017,Zee Cine Awards,Zee Cine Awards pics,Zee Cine Awards images,Zee Cine Awards photos,Zee Cine Awards sti
తాను తీసే సినిమాల క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడని రాజమౌళి తన హీరోలను అడిగినట్లుగానే అలియా భట్ ను కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ విషయమై బల్క్ డేట్స్ అడిగినట్లు సమాచారం. అయితే ఇలా బల్క్ డేట్స్ ఇవ్వడానికి అలియా భట్ అంగీకరించక పోవడంతో ఆమె పారితోషికం రెట్టింపు చేయడమే కాకుండా ఆమె ఇచ్చే డేట్స్ విషయంలో జూనియర్ చరణ్ లు రాజీపడేలా చేసి ఆమెకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తానని రాజమౌళి మరొకసారి ఆమెతో లేటెస్ట్ రాయబారాలు చేస్తున్నట్లు టాక్. దీనితో రాజమౌళి ఆఫర్ ను వదులుకోలేక ఒకవైపు ఈసినిమా కోసం ప్రస్తుతం తాను పీకల లోతు ప్రేమలో ఉన్న రణబీర్ సింగ్ ప్రేమకు దూరం కాలేక ఈ బల్క్ డేట్స్ విషయంలో ఎటూ నిర్ణయించుకోలేని అయోమయంలో అలియా భట్ ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: