హీరో నాని  ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘జెర్సి’ రిలీజ్ కు రెడీ అవుతున్న  నేపధ్యంలో ప్రస్తుతం ఈమూవీ  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వేగంగా జరుగుతోంది. ఫుల్ లెన్త్ స్పోర్ట్స్ డ్రామాగా తీస్తున్న ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకోసం నాని తన నటన విషయంలో అదే విధంగా తన బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా మార్పులు చేసుకున్నాడు. 

ఈసినిమాకు సంబంధించి కథ ప్రకారం హీరో పాత్రకు ట్రాజిక్ ఎండింగ్ ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రాసుకున్నాడని గతంలోనే టాక్ వచ్చింది. ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందనే అనుమానం ఈమూవీ టీమ్ తో పాటు నానీకి కూడ ఉన్నట్లు టాక్. దీనితో ఈ సినిమాకు సంబంధించి చివరి నిమిషం సమస్యలు రాకుండా రెండు వెర్షన్ల క్లైమాక్స్ ను షూట్ చేశాడట గౌతమ్. 
 Nanis Jersey movie teaser release date announced
అయితే ఈవిషయంలో ఈ మూవీ నిర్మాతలకు అతి దగ్గర వాడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఈమూవీకి సంబంధించి ఇప్పటికే షూట్ చేసిన ఈ రెండు క్లైమాక్స్ లు చూపించి ఏదో ఒకటి ఫైనల్ చేయమని అడగ బోతున్నారని టాక్.  ఇలాంటి సినిమాల ఫలితాలను శాసించేది క్లైమాక్స్ లే కాబట్టి ఈ మూవీ క్లైమాక్స్ విషయంలో చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నాని భావిస్తున్నట్లు సమాచారం. 
Jersy
శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న ‘జెర్సీ’ మూవీని వచ్చేనెల 5న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇది ఇలా ఉండగా ఇప్పటిదాక తన సినిమాలకు  సంబంధించి పెద్దపెద్ద స్టేట్మెంట్ లు ఇవ్వని నాని ‘జెర్సీ’ తన కెరియర్ లో బెస్ట్ మూవీగా మారబోతోంది అంటూ అంచనాలు పెంచేస్తున్నాడు. ఈ సినిమాలో నాని ఎక్కడా కనిపించడు అని కేవలం అర్జున్‌ పాత్ర మాత్రమే కనిపిస్తుంది అని నాని పెట్టుకున్న నమ్మకాన్ని ఎంత వరకు తెలుగు ప్రేక్షకులు నిలపెడతారో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: