టాప్ హీరోలతో నటించే అవకాశాలు వస్తే ఆ అవకాశాన్ని వదులుకోకుండా ఆ టాప్ హీరో పక్కన నటించడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు చేయడంలో నేటితరం హీరోయిన్స్ ఏమాత్రం రాజీపడటం లేదు. ఇలాంటి పరిస్థుతులలో మహేష్ తో నటించే అవకాశం తన దరికి వచ్చినా  సాయి పల్లవి ఆత్మాభిమానంతో ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది.అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నాయి. 

ఈ న్యూస్ వివరాలలోకి వెళితే మహేష్ తో సినిమాను తీయబోతున్న అనీల్ రావిపూడి సాయి పల్లవికి ఈమూవీ కథను వివరించడానికి ఈమధ్యనే చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి ఈమూవీ కథను పూర్తిగా అనీల్ రావిపూడి వివరించిన తరువాత సాయి పల్లవి ఈ విషయమై తన నిర్ణయం చెప్పడానికి కొంత సమయం అడిగినట్లు టాక్. 
ആരാധകരുടെ ഇഷ്ടതാരം
ఈలోగా ఈ న్యూస్ సోషల్ మీడియాకు లీక్ కావడంతో మహేష్ పక్కన సాయి పల్లవి బాగుంటుందా అంటూ కొందరు మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రోలింగ్ సాయి పల్లవి దృష్టి వరకు వెళ్లడంతో తాను మహేష్ తో కలిసి నటించను అనీ సాయి పల్లవి అనీల్ రావిపూడికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే అనీల్ రావిపూడి ఇది అంతా ఎవరికైనా సహజం అనీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు అని సద్ది చెప్పినా సాయి పల్లవి ఏమాత్రం అంగీకరించలేదు అని టాక్. 
കൈനിറയെ ചിത്രങ്ങള്‍
దీనితో వేరే మార్గం లేక అనీల్ రావిపూడి రష్మికతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రష్మిక ఇప్పటికే నితిన్ తో 'భీష్మయా మూవీలో అదేవిధంగా సాయి ధరమ్ ది తో మరొక మూవీతో పాటు ఆమె ఒప్పుకున్నా కన్నడ సినిమాలు కూడ ఉండటంతో తాను ఇచ్చే డేట్స్ కు మహేష్ సద్దుబాటు చేసుకోగలడా అన్న సందేహాలు రష్మిక వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో మహేష్ కు సాయి పల్లవి ఇచ్చిన స్టాక్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: