తెలుగు ఇండస్ట్రీలోకి విలన్ గా కెరీర్ ప్రారంభించి ‘అంకుశం’లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్ ఆ తర్వాత పలు యాక్షన్ చిత్రాల్లో నటించారు.   అల్లరి ప్రియుడు చిత్రంలో రొమాంటిక్ హీరోగా నటించిన ఆయన తర్వాత ఫ్యామిలీ తరహా చిత్రాల్లో నటించారు.  ఆ మద్య రాజశేఖర్ నటించిన చిత్రాలు వరుస ఫ్లాపులు కావడంతో చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  చాలా కాలం గ్యాప్ తర్వాత ‘గరుడవేగ’చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. 
Related image
ఈ చిత్రం అనుకున్నదానికన్నా ఎక్కువ సక్సెస్ అయ్యింది.  ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా  కన్మణి దర్శకత్వంలో 'అర్జున' సినిమా రూపొందింది. సీకే ఎంటర్టైన్మెంట్స్ .. హ్యాపీ మూవీస్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.   ఈ చిత్రంలో  మరియమ్ జకారియా హీరోయిన్ గా నటిస్తుంది. పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన ఈ చత్రంలోలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశారు. 

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది.  ఈ చిత్రంలో పోస్టర్ లో రెండు విభిన్నమైన లుక్స్ తో ఆయన కనిపిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. గతంలో పలు చిత్రాల్లో ద్విపాత్రాభినయంలో కనిపించారు. పెద్దగా హడావిడి లేకుండా వస్తోన్న ఈ సినిమా, ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: