తన క్లాస్ మెట్స్ తో అమాయకంగా కూర్చొని ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగి..తర్వాత తమిళ నాట కాలు మోపింది.  అక్కడే పలు హిట్ చిత్రాల్లో నటించిన జయలలిత తర్వాత  తమిళనాడు రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షురాలిగా.. ముఖ్యమంత్రిగా ఎంతో గొప్ప పేరు సంపాదించింది. 


తమిళ నాట అందరూ ఆమెను ఎంతో ప్రేమగా అమ్మా అని పిలుస్తారు.   రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది.  జయలలిత 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది.


 జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు.  జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.  జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రము పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: