మహిళా ఎంట్రెప్రెన్యూర్‌గా వ్యాపారంలో  అనూహ్య విజయాలు సాధిస్తున్న ఉపాసన కేవలం మెగా కోడలుగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పర్చుకుంది. మహిళా వ్యాపార వేత్తగా చరణ్ భార్యగా  తన బాధ్యతలను    రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న ఈమె ఈరోజు జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
కొన్ని సార్లు భర్త తప్పులు చేస్తారు
ప్రస్తుతం పరిస్థుతులు మారిపోయినా మహిళలను అన్ని రంగాలలో తోక్కేస్తున్నారు అన్న ఫిలింగ్ ఇంకా ఉండిపోయింది అని వాస్తవానికి సమర్ధత ఉన్న మహిళను ఎవరూ తోక్కేయలేరు అన్న అభిప్రాయం వ్యక్త పరిచింది. అయితే కొందరు మహిళలు తమకు లభించిన స్వేచ్చను విచ్చలవిడిగా వాడేస్తూ మహిళాలోకానికి  మచ్చ తెస్తున్నారు అన్న విమర్శలు ఉన్నమాట వాస్తవమే అయినా ఈవిషయం పై ఎప్పుడూ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి అంటూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్త పరిచింది ఉపాసన. 
మనది అద్భుతమైన కల్చర్
ప్రతి సక్సెస్‌ఫుల్ మ్యాన్ వెనుక ఉమెన్ ఉంటుంది అన్న విషయానికి సరైన ఉదాహరణ తన అమ్మమ్మ అని అంటూ  ఆమె ఒక స్ట్రాంగెస్ట్ ఉమెన్ అని చెపుతూ ఆమె వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నా అని అంటోంది ఈ మెగా కోడలు.  భర్తను విజయవంతంగా ముందుకు నడిపించడంలో భార్య పాత్ర కీలకం అని చెపుతూ కొన్నిసార్లు భర్తలు తప్పు చేసినప్పుడు భార్యలు తమ బౌండరీలోనే ఉండిపోకుండా రూల్స్ బ్రేక్ చేసి భర్తలు చేసిన తప్పులు వారికి తెలిసి వచ్చేలా వ్యూహాత్మకంగా చెప్పవలసిన బాధ్యత భార్యలదే అంటూ చరణ్ తప్పులు చేసినా ఆవిషయాలు అతడికి తెలిసి వచ్చేలా తాను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాను అని మహిళాదినోత్సవం రోజున చరణ్ పై కామెంట్స్ చేసింది. 
అంతా బావుంది, మార్పు అవసరం లేదు
ఇదే సందర్భంలో ఆమె మహిళల విషయంలో సమాజంలో ఇప్పుడున్న విషయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు ఉపాసన స్పందిస్తూ అలాంటి అవసరం ఏమీ లేదని కేవలం మహిళల కోసమే సమాజం మారదనీ కామెంట్స్ చేసింది. అంతేకాదు ప్రతి మహిళ తనకు కావలసిన విధంగా పరిస్తుతులను మార్చుకోవాలి కాని మహిలకంటూ ప్రత్యేకమైన పరిస్థుతులు ఉండవు అంటూ అభిప్రాయ పడుతున్న ఉపాసన మాటలలో ప్రతి మాటలోనూ ఆమె వ్యక్తిత్వం స్పష్టంగా కనపడుతోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: