రాజమౌళి సినిమాలు అంటే భారీ సెట్టింగ్స్ భారీ గ్రాఫిక్స్ సర్వసాధారణం. అయితే దానికి భిన్నంగా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ ను సుమారు 40 రోజులు కలకత్తాలో షూట్ చేయడం వెనుక అనేక కారణాలతో పాటు కొన్ని సెంటిమెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం కలకత్తాను తన రాజధానిగా కొనసాగిస్తూ అనేక సంవత్సరాలు పాలించింది. ఆతరువాత 19వ శతాబ్ద ప్రారంభంలో బ్రిటీష్ ప్రభుత్వం తన రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చింది. 

అయితే సుధీర్ఘ కాలం బ్రిటీష్ ప్రపభుత్వం కలకత్తా నుండి పరిపాలన సాగించడంతో అక్కడి చాల పాతభవనాలు బ్రిటీష్ ఆర్క్ టెర్చర్ విధానంలో నిర్మించారు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ఫ్లాష్ బ్యాక్ అంతా బ్రిటీష్ కాలంనాటి వాతావరణంలో ఉంటుంది. దీనితో అలనాటి బ్రిటీష్ కాలానికి సంబంధించిన భారీ సెట్టింగ్స్ వేసేకంటే సహజత్వంతో ఉండే కలకత్తాలోని బ్రిటీష్ కాలంనాటి పాత భవనాలలో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ చేస్తే బడ్జెట్ ఎకానిమీతో పాటు సహజత్వం కూడ కనిపిస్తుంది అని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. 

కలకత్తాలోని చాల ప్రాంతాలలో ఇప్పటికీ బ్రిటీష్ కాలంనాటి బిల్డింగ్ లతో పాటు అప్పటి వాతావరణాన్ని ప్రతిభింభించే పరిస్థుతులు అక్కడక్కడా కనిపిస్తాయి. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన అలనాటి ఒక దృశ్యాన్ని హౌరా బ్రిడ్జి పై సహజత్వంతో తీయాలని రాజమౌళి ఆలోచన. అలాంటి ఉద్యమానికి సంబంధించి హౌరా బ్రిడ్జిని పోలిన ఒక సెట్ వేసి హైదరాబాద్ లో షూటింగ్ చేస్తే చరణ్ జూనియర్ లకు ఉన్న క్రేజ్ రీత్యా విపరీతమైన జనం వచ్చి రాజమౌళి ఏకాగ్రతకు భంగం ఏర్పడుతుందని జక్కన్న భావన అని కూడ అంటున్నారు.  

దీనికితోడు కలకత్తాలోని చాల ప్రాంతాలలో ఇప్పటికీ బ్రిటీష్ కాలంనాటి బిల్డింగ్ లతో పాటు అప్పటి వాతావరణాన్ని ప్రతిభింభించే పరిస్థుతులు అక్కడక్కడా కనిపిస్తాయి. అదేవిధంగా చిరంజీవి సినిమాలలో కెరియర్ బెస్ట్ గా చెప్పుకునే ‘చూడాలని ఉంది’ మూవీలోని చాల సన్నివేశాలు కలకత్తాలో తీసిన సెంటిమెంట్ చరణ్ కు కలిసి వస్తుంది అన్న సెంటిమెంట్ రీత్యా కూడ రాజమౌళి ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు అని అంటున్నారు. ఏది ఏమైనా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి అత్యంత కీలకమైన ఈ షెడ్యూల్ చిత్రీకరణ విషయంలో రాజమౌళి తన పద్ధతులు చాల మార్చుకున్నాడు అని పిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: