తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు.  వారిలో అక్కినేని నాగార్జున, అమల ఒకరు.  వీరి వారసులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా రాణిస్తున్నారు.  జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రి ఇచ్చిన నాగచైతన్య తర్వాత వచ్చిన ‘ఏం మాయ చేసావే’చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు.  ఈ చిత్రంలో తన సహనటి అయిన సమంతను ప్రేమించి గత యేడాది రెండు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. 
Related image
పైళ్లైన తర్వాత ఈ జంట మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు.  "వన్ బాయ్ .. వన్ గర్ల్ లుకింగు .. హైటు .. వెయిటు చెకింగు .. పేరెంట్స్ ఫిక్సింగ్ మ్యాచింగు .. డౌరీ గివింగ్ .. మ్యారేజ్ బెల్సు రింగింగు .. సింగులు బెడ్డూ షేరింగు .. ఇన్ సైడ్ ఫస్టు లవ్ కిల్లింగు .. యూఆర్ డైయింగు .. " అంటూ హీరో వైపు నుంచి ఈ పాట సాగుతోంది.
Related image
గోపీసుందర్ సంగీతం .. భాస్కర భట్ల సాహిత్యం .. రేవంత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి.  ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్ కి మంచి స్పందన వచ్చింది.    ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: