ఇప్పటివరకు అనేక సార్లు ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తల పై స్పందించిన కృష్ణంరాజు ఈమధ్య ఈవిషయమై మీడియాతో  మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఈసారి ఈవిషయమై కృష్ణంరాజు భార్య శ్యామలదేవి మాట్లడటం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి తనకు ఎదురైనా ప్రశ్నకు సమాధనం ఇస్తూ కొంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. 
Prabhas, 100 Days Of Baahubali 2, Prabhas mumbai photos, Prabhas latest photos, Saaho
ఈఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్ మనస్థత్వం గురించి మాట్లాడుతూ ప్రభాస్ దగ్గర తాను ఎప్పుడు పెళ్లి గురించి ఆరా తీసినా సినిమాల గురించి మాట్లాడేందుకే ఇష్టపడతాడు కాని పెళ్లి విషయంలో సమాధానాలు దాటవేస్తాడు అన్న విషయాన్ని ఆమె బయటపెట్టారు. అంతేకాదు ప్రభాస్ ఎప్పుడు ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా అయిపోయిన తరువాత తన పెళ్లి గురించి చెపుతాను అంటూ దాట వేత సమాధానం ఇస్తూ ఉంటాడు అన్న విషయం ఆమె తెలియచేసారు. 
Prabhas, 100 Days Of Baahubali 2, Prabhas mumbai photos, Prabhas latest photos, Saaho
అయితే ఇదే సందర్భంలో ప్రభాస్ కి కాబోయే అమ్మాయి ఎలా ఉండాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభాస్ కు కాబోయే భార్య తమ  అందరితో కలిసిపోయే అమ్మాయి కావాలి అంటూ తమ కుటుబం చాలా పెద్దది కాబట్టి ప్రభాస్ భార్యకు పెద్ద భాద్యతలు ఉంటాయని శ్యామల దేవి అభిప్రాయపడ్డారు. అంతేకాదు తన భర్త కృష్ణంరాజు ప్రతియేటా కృష్ణంరాజు  ఒక రిసార్ట్ లో ఫ్యామిలీ  గెట్ టుగదర్ ఏర్పాటు చేస్తారు అని చెపుతూ అక్కడ ప్రతిసారి తమ మధ్య ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వస్తుంది అన్న విషయాన్ని తెలియచేసారు. 

ఇదే సందర్భంలో ఆమె మరో కామెంట్ చేస్తూ ప్రభాస్ కూడ తన భార్యగా తమ ఇంటికి వచ్చే అమ్మాయి అందరితో కలిసిపోయే అమ్మాయిగా ఉండాలని కోరుకుంటున్న విషయాన్ని వెల్లడించాడు. అయితే ప్రభాస్ పెళ్లి పై టీవీ ఛానెళ్లుతో పాటు మీడియాలోవచ్చే న్యూస్ లు చూసి తాము తెగ నవ్వుకుంటామని కేవలం మీడియా టీఆర్ పీ రేటింగ్స్ కోసం ప్రభాస్ పెళ్లి పై వార్తలు ప్రచారంలోకి తీసుకు రావడం చాలమందికి ఒక ఫ్యాషన్ గా మారిపోయిన విషయాలను ప్రస్తావిస్తున్నారు శ్యామల దేవి..    



మరింత సమాచారం తెలుసుకోండి: