తెలుగు ఇండస్ట్రీలో పటాస్ తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు నందమూరి కళ్యాన్ రామ్.  ఈ నేపథ్యంలో ప్రముఖ  సినిమాటోగ్రఫర్ గా ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసిన గుహన్ దర్శకుడిగా మారి  ‘118’చిత్రాన్ని తెరకెక్కించారు.  వైవిధ్యభరిత కథనంతో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.  '118' చిత్రం ఈ నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Image result for 118 movie guhan
విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది.   మధ్య కాలంలో కల్యాణ్ రామ్ కి సంతోషాన్నీ .. సంతృప్తిని కలిగించిన సినిమాగా దీనిని గురించి చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు పలు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. 
Image result for 118 movie guhan
ఆసక్తిని రేకెత్తించే కథనంతో సాగే ఈ చిత్రాన్ని చూస్తూ తాను చాలా ఎంజాయ్ చేసినట్టుగా చెప్పాడు. సినిమాటోగ్రఫర్ గా,దర్శకుడిగా గుహన్ అద్భుతమైన పనితీరును కనబరిచారంటూ ప్రశంసించారు.  ఈ చిత్రంలో ప్రతి ఒక్క నటులు చాలా బాగా నటించారని ప్రశంసించారు.   మహేశ్ బాబు స్పందనకి ఈ చిత్ర టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆయనకి ధన్యవాదాలు తెలియజేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: