మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసిమ్హారెడ్డి పాత్రలో నటిస్తున ప్రతిష్టాత్మకంగా చిత్రం  సైరా.. ఈ మూవీలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. ఈ మూవీని మెగాస్టార్ ప్రాణం పెట్టి చేస్తున్నారు. ఇప్పటికి చిరంజీవి నటించిన 150 చిత్రాలు ఓ ఎత్తు అయితే సైరా మరో ఎత్తు అన్నట్లుగా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారట. ఈ మూవీని మొదట దస‌రాకు అనుకున్న ఇపుడు ఆగస్ట్ 15 నాటికి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారని భోగట్టా. ఈ మూవీలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి.



1. చిరంజీవి కుమారుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ మీద ఈ మూవీని తీస్తున్నారు. 
2 ఈ మూవీలో మెగాస్టార్ సరసన తొలిసారిగా సౌత్ ఇండియన్ క్వీన్ నయనతార జంటగా నటిస్తోంది.
3 ఈ మూవీలో మరో కీలకమైన పాత్రలో తళుకు బెళుకుల తార తమన్నా నటిస్తోంది. 


4. విశ్వ నాయకుడు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ కూడా ఈ మూవీలో మరో  ముఖ్య పాత్రలో మెరియనుంది.
5. ఇక చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నీహారిక కూడా ఈ సినిమాలో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
6 ఈ సినిమాలో ది గ్రేట్ అమితాబ్ బచ్చన్,  విజయ్ సేతుపతి, జ‌గపతి బాబు వంటి ఉద్దండులు ఎందరో నటిస్తున్నారు


7 ఈ మూవీ క్లైమాక్స్ ఇప్పటి వరకూ  వీరుల గాధలతో వచ్చిన సినిమాలకు భిన్నగా ఉంటుందని సమాచారం.
8 ఈ మూవీ తొలి స్వాతంత్ర సమరయోధుని జీవితం ఆధారంగా నిర్మాణం కావడం విశేషం.


9 నిజానికి ఈ సినిమా కధ పరుచూరి బ్రదర్స్ రాసి ఇప్పటికి రెండు దశాబ్దాలు దాటింది. ఇన్నాళ్ళకు సినిమాగా వస్తోంది.
10 ఇంకో చిత్రమేంటంటే ఈ మూవీని మొదట నందమూరి బాలక్రిష్ణతో తీయాలనుకున్నారు. అయితే అప్పట్లో అది కుదరలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: