ఈనెల 22న విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ‘సింహ గర్జన’ పేరుతో నిర్వహించారు. ఈ సందర్భంలో పోసాని కృష్ణ మురళీ ఆవేశంతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈమూవీకి సెన్సార్ పరంగా అడ్డంకులు క్రియేట్ చేయాలని కొందరు వ్యక్తులు చేస్తున్న భారీ కుట్రను బయటపెడుతూ వాస్తవాలను చూపెట్టే ఈసినిమా గురించి కొందరు ప్రముఖ వ్యక్తులు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్ధం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
సినిమాను బయటకు రానివ్వరా? ఎందుకు ఈ వెధవ వేశాలు
అంతేకాదు ఈమూవీకి అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తున్న వారికి నిరాస మిగులుతుందని ఎలాంటి పరిస్థుతులలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈమూవీని వర్మ విడుదల చేయడం ఖాయం అంటూ పరోక్షంగా నందమూరి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం అధినాయకత్వానికి హెచ్చరికలు చేసాడు పోసాని. అయితే ఈమూవీ కథ అంతా లక్ష్మీ పార్వతి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆమె ఈమూవీ విషయంలో వర్మకు సపోర్ట్ ఇస్తున్నంత కాలం ఈమూవీ విడుదలకు ఎటువంటి అడ్డంకులు ఉండవని ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. 
నీకే ఈ కష్టాలు ఎందుకంటే...
ఇదే ఫంక్షన్ లో పోసాని రామ్ గోపాల్ వర్మను ఆకాశంలోకి ఎత్తేస్తూ కొన్ని కామెంట్స్ కూడ చేసాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వింప తగ్గ దర్శకుడు వర్మ అని చెపుతూ లక్ష్మీ పార్వతి విషయంలో అన్యాయం జరిగింది కాబట్టే వర్మ ఆమెకు సపోర్ట్ ఇస్తూ ఈసినిమా తీసాడని చెపుతూ నిజాయితీకి మరోకపేరు వర్మ అంటూ భారీ పొగడ్తలను కురిపించాడు. 
సెన్సార్ వారికి విజ్ఞప్తి
అయితే పోసాని ఇంత ఆవేశంగా మాట్లాడితే వర్మ దానికి రివర్స్ లో కూల్ గా మాట్లాడుతూ తాను నందమూరి కుటుంబ సభ్యులను కానీ ముఖ్యంగా బాలకృష్ణను కానీ కించపరచాలని తాను ఈమూవీ తీయలేదు అనీ కేవలం వాస్తవాలు జనానికి తెలియాలి అన్న ఉద్దేశ్యంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసిన విషయాన్ని వ్యూహాత్మకంగా వివరించాడు. అంతేకాదు ఒక మహిళకు జరిగిన అన్యాయం తన సినిమాలో కనిపిస్తుంది కానీ తన మూవీలో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని వర్మ చెపుతున్నాడు. ఒకవైపు పోసాని హెచ్చరికలు ఇస్తుంటే మరొకవైపు వర్మ చాల తెలివిగా మాట్లాడుతూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అనుసరించిన ద్వంద వైఖరి పరిశీలించిన వారికి వర్మకు రాజకీయాలు బాగా ఆకళింపు చేసుకున్నాడు అని అనిపిస్తుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: