రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చాలా విషయాలు వర్మ పంచుకున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సబ్జెక్ట్ మీద నేను ముందుగా ఆసక్తి కలిగి లేను. ఆ టైమ్ లో అంటే ఆ కాలంలో నేను రంగీలా షూటింగ్ లో ముంబాయిలో వున్నాను. ఫస్ట్ టైమ్ ఈ సబ్జెక్ట్ నాకు బాలయ్య గారితో బయోపిక్ మీద డిస్కస్ చేసినపుడు ఫోకస్ దీనిమీదకు వచ్చింది. అప్పుడు దాంట్లో గ్రేట్ మెటీరియల్ ఉందనిపించింది అని చెప్పాడు. 

Image result for ram gopal varma

బాలయ్య మీకు బయోపిక్ బాధ్యతలు అప్పగించి వుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ వుండేది కాదు అనే ప్రశ్నకు , వర్మ చెబుతూ ఇక్కడ టూ పాయింట్స్ వున్నాయి. ఒకటి నిజం. ఇంకో నిజం ఏమిటంటే, ఈ యాస్పెక్ట్ లేకపోతే తీసేవాడిని కాదు. బాలయ్య నిర్మాత కూడా. ఆయన ఈ ఎపిసోడ్ వద్దు అని వుండేవారు. అప్పుడు నేను తీసి వుండేవాడిని కాదు. ఎన్టీఆర్ బయోపిక్ రెండుభాగాలు చూసారా? అనే ప్రశ్నకు ఏదో కూర్చుని, అప్పుడు ఇలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పుకున్నట్లు కనిపించింది. రామారావు చేతులు కట్టుకుని వేషాలు అడిగారు అనే విధంగా చూపిస్తే చూడలేం. అలా చిరంజీవిని, ఎఎన్నార్ ను చూడగలం కానీ రామారావును కాదు.

Image result for lakshmis ntr

ఎందుకంటే ఆయన పుట్టడమే రాముడిగా, కృష్ణుడిగా పుట్టాడు అనిపిస్తుంది చూస్తుంటే. అందువల్ల సినిమాలో బిలీవబుల్ ఫ్యాక్టర్ తక్కువ వుంటుంది. అది నాకు పెద్దగా నచ్చలేదు. నేను అయితే రెండు భాగాలు కలిపి మొత్తం అరగంటకో, గంటకో కుదించి, ఈ లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను కీలకంగా జోడించి వుండేవాడిని. ఇంకా మాట్లాడుతూ ఈ సినిమా ను బయటికీ రాకుండా ఎవరు ఆపలేరు.  ఒకటి నన్ను ఎవరైనా చంపేయాలి. అయినా దానికి కూడా ఓ మార్గం ఆలోచించి వుంచాను. ఓ హార్డ్ డిస్క్ లో అంతా వుంచి, నాకేమైనా అయితే ఇందులో వున్న కంటెంట్ అంతా యూ ట్యూబ్ లో పెట్టాలని చీటీరాసి పెట్టాను. అందువల్ల దీన్ని బయటకు రాకుండా అయితే ఎవరూ ఆపేయలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: