ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నవి రెండేరెండు విషయాలు ఒకటి ఐటి గ్రిడ్ కు సంబంధించి డేటా కుంభకోణం అయితే మరొకటి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ఈరెండు విషయాలు తప్ప సాధారణ జనం ప్రస్తుతం ఏవిషయాలు పట్టించుకోని స్థితి. ఐటి గ్రిడ్ వ్యవహారం తెలుగుదేశం పార్టీని అతలాకుతలం చేస్తుంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ నందమూరి కుటుంబ సభ్యులను ముఖ్యంగా బాలకృష్ణను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. 
లక్ష్మీస్ ఎన్టీఆర్ నాకు చాలా స్పెషల్
బాలకృష్ణ దగ్గరనుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు వేదికల పైకి వచ్చారు అంటే ఎన్టీరామారావు ఖ్యాతి గురించి అలాంటి ఘనత వహించిన నందమూరి ఫ్యామిలీలో పుట్టిన తమ అదృష్టం గురించి పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు వారు చెప్పుకుంటున్న ఖ్యాతికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఏవిధంగా డ్యామేజ్ చేస్తుంది అన్నవిషయంలో ప్రస్తుతం జూనియర్ కన్నా ఎక్కువ టెన్షన్ బాలకృష్ణ పడుతున్నాడు. వాస్తవానికి రామారావు నట వారసుడుగా మాత్రమే కాకుండా రాజకీయ వారసుకుడుగా కూడ ఎదిగిన బాలకృష్ణ పై నెగిటివ్ ఎటాక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో లేకపోయినా ఎన్టీఆర్ కు ఆరోజు జరిగిన అవమానానికి సంబంధించిన సంఘటనలలో బాలకృష్ణ మౌనం వహించిన సాక్షి అంటూ స్పష్టంగా వర్మ చూపించబోతున్నాడు. 
బెదిరింపులకు భయపడను
దీనితో తండ్రి వారసుడుగా ఎన్నో గొప్పలు చెప్పుకునే బాలయ్య ఇమేజ్ కి ఈనెల విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ పరోక్షంగా దెబ్బ తీయబోతోంది. రాజకీయాలలో జయాపజయాలు సహజం. అనుకోకుండా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రభావంతో చంద్రబాబునాయుడు ఇమేజ్ మసకబారి ఓడిపోయినా మరో ఎన్నికలలో గెలిచే అవకాసం ఉంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబునాయుడుకు పరాజయాలు కొత్తవి కావు. కానీ ఒక కొడుకుగా తన తండ్రికి జరిగిన వెన్నుపోటు సంఘటనలో బాలకృష్ణ మౌనపాత్ర వహించాడు అన్న సంకేతాలు ఇప్పటి తరం యూత్ కు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ద్వారా వెళితే ఏర్పడే ఆ నెగిటివ్ ఇమేజ్ ని పోగొట్టుకోవడానికి బాలకృష్ణ కష్టపడవలసి ఉంటుంది. 
రెండు గంటల్లో చూపించడం కష్టం
దీనికితోడు రాబోతున్న ఎన్నికలలో బాలకృష్ణ పోటీ చేయబోతున్న నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ చేత బాలకృష్ణకు అంకితం ఇవ్వబడుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బాలయ్యకు పెను సమస్యలు తెచ్చిపెట్టడం ఖాయం అని అంటున్నారు. బాలకృష్ణ ఎంతో కష్టపడి నటించిన ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్ అయిన నేపధ్యంలో అనుకోకుండా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సాధారణ ప్రేక్షకులకు కనెక్ట్ కాగలిగితే ఆ అవమాన భారం నుండి తేరుకోవడానికి బాలయ్యకు చాల సమయం పట్టే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: