వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పటికే మోస్ట్ కాంట్రవర్సీ మూవీగా నిలిచింది. అధికార పార్టీ టీడీపీ ని టార్గెట్ చేయడంతో టీడీపీ శ్రేణులు వర్మ మీద గుర్రుగా ఉన్నారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీయడానికి తన ప్రేరణనిచ్చిన వ్యక్తి బాలయ్యే అన్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాను బాలయ్యకే అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు. అసలే ఈ సినిమా మీద గుర్రుగా ఉన్న బాలయ్య ను వర్మ బాగానే రెచ్చ గొడుతున్నాడు. కానీ పోసాని మాత్రం మరో వెర్షన్ వినిపించాడు. వర్మకు స్ఫూర్తినిచ్చింది బాలయ్యే అయినప్పటికీ, ఈ సినిమా తీయడానికి వర్మకు వందశాతం ఉత్సాహాన్నిచ్చిన వ్యక్తి కేవలం చంద్రబాబు మాత్రమేనని అన్నాడు.


సినిమా బయటికి రాకుండా ఎవరు ఆపలేరు ... యూట్యూబ్ లో అయినా రిలీజ్ చేస్తా ..!

"నువ్వు (చంద్రబాబు) వెన్నుపోటు పొడవకుండా ఉండుంటే వర్మ ఈ సినిమా తీసేవాడు కాదు. కాబట్టి వర్మకు నువ్వే అవకాశం ఇచ్చావు. నువ్వు వెధవ వేషాలు వేసిన ప్రతిసారి వర్మ రెడీగా ఉంటాడు." ఇలా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెనకున్న చోదక శక్తి చంద్రబాబు మాత్రమే అంటున్నాడు పోసాని. నిజాయితీగా ఉంటే రాజకీయాల్లో ఎవరికీ ఎలాంటి సమస్యలు రావని, నీతిగా ఉండకపోవడం వల్లనే సమస్యలన్నీ వస్తుంటాయని అన్న పోసాని.. చంద్రబాబుకు సమస్యలు రావడానికి కారణం అతడిలో నీతి లేకపోవడమే అన్నారు.

వర్మకు అవకాశం ఇచ్చింది చంద్రబాబే!

"ఈ వెధవ వేషాలు ఎందుకు? నువ్వు నిజాయితీగా ఉండొచ్చు కదా. ఎవడైతే నిజాయితీగా ఉండడో, నీతిగా ఉండడో వాళ్లకే సమస్యలు వస్తాయి. వాజపేయికి రాలేదుగా, అద్వానీకి రాలేదుగా. వెధవ వేషాలు వేసే వాడికి, అవినీతి పనులు చేసేవాడికి, వెన్నుపోటు పొడిచిన వాళ్లకే బాధలు, కోపాలు వస్తుంటాయి." ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఉదంతంపై తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదంటున్నాడు పోసాని. అలా అడ్డుకుంటే తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టేనని స్పష్టంచేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: