చిరంజీవి కెరియర్ లో 'గ్యాంగ్ లీడర్' ఒక ట్రెండ్ సెటర్ మూవీ. ఆమూవీ ఘన విజయం తరువాత చిరంజీవి మెగా స్టార్ గా మారిపోయాడు. ఆసినిమాను రీ మేక్ చేయాలని లేదంటే కనీసం ఆమూవీ టైటిల్ ను ఉపయోగించు కోవాలని రామ్ చరణ్ అల్లు అర్జున్ ల మనసులో ఉన్నా అటువంటి సాహసం చేయడానికి భయపడిపోయారు. 
పర్మీషన్ లేకుండా ఎలా అనౌన్స్ చేస్తారు?
ఇలాంటి పరిస్థుతులలో దర్శకుడు విక్రమ్ కుమార్ నానీతో తీయబోతున్న తన లేటెస్ట్ మూవీకి 'గ్యాంగ్ లీడర్' అన్న టైటిల్ ఫిక్స్ చేసి నానీ పుట్టినరోజున ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. నానీ సినిమాకు 'గ్యాంగ్ లీడర్' లాంటి టైటిల్ పెట్టె అర్హత ఉందా అంటూ మెగా అభిమానులు నానీని టార్గెట్ చేస్తూ సెటైర్లు కూడ వేశారు. అయితే ఈవిషయాలను నాని చాలా లైట్ గా తీసుకున్నాడు. 
మా టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు
ఇలాంటి పరిస్థుతులలో నానీతో తీయబోతున్న 'గ్యాంగ్ లీడర్' తమది అంటూ ఒక నిర్మాత మీడియా సమావేశం పెట్టి ప్రకటించడమే కాకుండా ఆ టైటిల్ పై నానీకి కానీ దర్శకుడు విక్రమ్ కుమార్ కు కానీ ఎటువంటి హక్కులు లేవు అంటూ ప్రకటన చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఆసక్తి కలిగించే ఈ నీఊస్ వివరాలలోకి వెళితే నిర్మాత మరియు హీరో మోహన కృష్ణ ఫిలిం చాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో ఈ విషయాలను తెలియచేసాడు. 
తెర ముందు, తెర వెనుక
మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపీ ఫిలిం చాంబర్లో 'గ్యాంగ్ లీడర్' టైటిల్ తాను చాలాకాలం క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఈసినిమా షూటింగ్ రాబోతున్న ఉగాది రోజున ప్రారంభించి ఈ ఏడాది ఆగష్టులో వచ్చే చిరంజీవి పుట్టినరోజునాడు విడుదల చేసేలా తాను ప్లాన్ చేసినట్లు ఈమీడియా సమావేశంలో తెలియ చేయడమే కాకుండా నానీ విక్రమ్ కుమార్ ల మూవీకి టైటిల్ మార్చకుంటే తాను కోర్టు కేసులు వేస్తానని హెచ్చరికలు ఇస్తున్న నేపథ్యంలో నాని మరో టైటిల్ వైపు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. . 


మరింత సమాచారం తెలుసుకోండి: