సినిమాలకు దూరమై కోట్లాది రూపాయల పారితోషికాలను వదులుకుని ప్రజలకు కొత్త రాజకీయాలను పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్న పవన్ ఉద్దేశాలను పవన్ కు అత్యంత సన్నిహితులు అతడి వీరాభిమానులు కూడ అర్ధం చేసుకోకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ను బిగ్ బాస్ గా అత్యంత గౌరవంతో పిలుచుకునే బండ్ల గణేష్ ‘జనసేన’ లో చేరకుండా కాంగ్రెస్ లోకి చేరిపోయాడు.
పవన్‌ ఫాన్సే కానీ పార్టీ మార్చేసారు!
అదేవిధంగా పవన్ సినిమాలలోకి రాక ముందు నుండి పవన్ తో సాన్నిహిత్యం కొనసాగించిన అలీ ప్రస్తుతం రాబోతున్న ఎన్నికలలో తెలుగుదేశం తరపున పోటీ చేస్తూ ఏకంగా జనసేన పార్టీకి సవాల్ విసరబోతున్నాడు. ఇది చాలదు అన్నట్లుగా ‘బిగ్ బాస్ 2’ విన్నర్ కౌశల్ లేటెస్ట్ గా చంద్రబాబునాయుడును కలిసి తెలుగుదేశం పార్టీ కోసం తాను ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి తెలుగుదేశానికి ఓట్లు వేయిస్తానని మాట ఇచ్చాడు. 
First Break for Pawan Kalyans porata yatra
అయితే కౌశల్ కూడ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని ఇలా పవన్ వీరాభిమానులు అంతా వేరే పార్టీలలోకి వెళ్ళిపోతూ ఉంటే పవన్ ‘జనసేన’ ఏమి చేయగలుగుతుంది అన్న అయోమయంలో పవన్ అభిమానులు కూడ ఉన్నట్లు టాక్. సాధారణంగా ఒక పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీలోకి జంప్ లు సహజమే అయినా పవన్ ను నిరంతరం పొగిడే ఈ ముగ్గురూ ప్రస్తుతం పవన్ పక్కన లేకుండా వేరే పార్టీలో ఉండటం వెనుక ఏమైనా ఎత్తుగడలు ఉన్నాయా అన్న కోణంలో కూడ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో జరుగుతున్న పరిణామాలను లెక్క చేయకుండా పవన్ తన వ్యూహాలను కొనసాగిస్తున్నాడు. అయితే ఆశ్చర్యకరంగా ఫిలిం ఇండస్ట్రీలోని పెద్ద స్టార్స్ నుండి చిన్న స్టార్స్ వరకు ఏ ఒక్కరు పవన్ ‘జనసేన’ లో లేని నేపధ్యంలో పవన్ పట్ల ఇండస్ట్రీ వర్గాలలో కూడ ఆసక్తి లేదా అన్న కోణంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: