800 మంది సభ్యులు ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు సాధారణ ఎలక్షన్స్ మాదిరిగా హాట్ న్యూస్ గా మారాయి. శివాజి రాజా, నరేష్ అధ్యక్ష పదవిగా పోటీ చేస్తున్న ఇద్దరు పరిశ్రమలో మంచి పేరు ఉన్నవారే.. ఇద్దరికి అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఆల్రెడీ శివాజి రాజా ప్యానెల్ లాస్ట్ ఇయర్ వర్క్ చేశారు. అధ్యక్షుడిగా శివాజి రాజా పనిచేశారు. 


ఈరోజు జరుగుతున్న మా ఎన్నికల్లో ఎవరికి గెలుపు వరిస్తుంది అన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే శివాజి రాజా పనితనం బాగున్నా కొన్ని పనుల్లో వెనుక పడ్డాడని ఈసారి నరేష్ కు అధ్యక్ష పదవి ఇస్తేనే బెటర్ అని భావిస్తున్నారట. ఆల్రెడీ మొదలైన ఈ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది.


సాయంత్రం 5 గంటలకు విజేత ఎవరన్నది తెలుస్తుంది. నరేష్ ప్యానెల్ లో జీవిత, రాజశేఖర్, శివ బాలాజి, మధుమిత వంటి వారు ఉన్నారు. అయితే మా ఎలక్షన్స్ ఇంత ప్రెస్టిజియస్ గా ఎందుకు తీసుకున్నారు ఇదవరకు ఏకగ్రీవంగా ఎన్నుకునే ఈ అధ్యక్ష పదవికి ఇలా ఎందుకు పోటీ ఏర్పడింది అంటే మా నిధులు దుర్వినియోగం అవుతున్న సందర్భంగా ఇలా పోటీ ఏర్పడిందని అంటున్నారు.


అంతేకాదు 'మా' లో ఉన్న ఇబ్బందులు తొలగించే విధంగా కొత్త ప్యానెల్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. శివాజి రాజా, నరేష్ లలో నరేష్ కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. మరి అసలు ఫలితం ఏంటి కొత్త అధ్యక్షుడు ఎవరు అన్నది సాయంత్రం తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: