మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టిన రోజు మార్చి 27న బిగ్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది. రాం చరణ్ నిర్మాణంలో భారీ అంచనాలతో వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా రిలీజ్ డేట్ ను ఆరోజు ప్రకటించబోతున్నారట. రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ కు సంబందించి ఓ సర్ ప్రైజ్ ఫస్ట్ లుక్ కూడా బర్త్ డే నాడు వస్తుందని తెలుస్తుంది. 


బాహుబలి తరహాలో ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నడు రాజమౌళి అందుకే రాబోతున్న రాం చరణ్ బర్త్ డే నాడు ట్రిపుల్ ఆర్ లుక్ రివీల్ చేస్తాడట. పిరియాడిక డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది.


ఇక ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. చిరు 151వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ కూడా భారీ స్థాయిలో వస్తుంది. బాహుబలికి ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ ఉంటుందట. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. 


సైరా తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా తెరకెక్కిస్తున్నారు. అందుకే అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ ఆగష్టు 15న కొందరు.. దసరాకి అని మరికొందరు అంటున్నారు. అసలు రిలీజ్ డేట్ ఎప్పుడన్నది మార్చి 27న తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: