సినిమాలలో కలిసి నటిస్తూ ఒకరి పై ఒకరు ప్రేమానురాగాలు కురిపించుకునే టాలీవుడ్ స్టార్స్ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ‘మా’ సంస్థ ఎన్నికలకు జరిగిన పోరాటానికి సంబంధించిన ఎన్నికలు ఈరోజు ఉదయం ప్రారంభం అయి మరి కొద్ది సేపట్లో ముగియబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటల నుండి ఆహ్లాదకరమైన వాతరణంలో ప్రారంభం అయింది. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా సాధారణ ఎన్నికల స్థాయిని మించి విమర్శలు ప్రతి విమర్శలతో ఇరు వర్గాలు ఈ ఎన్నికలకు సంబంధించి మీడియాకు ఎక్కాయి. శివాజీ రాజా ప్యానెల్ నరేష్ ప్యానెల్ మధ్య నువ్వా నేనా అంటూ జరుగుతున్న ఈ ఎన్నికలలో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీ ఉంటుంది అని అంటున్నారు. నేటి సాయంత్రం 8 గంటల ప్రాంతంలో ‘మా’ సంస్థ ఎన్నికల ఫలితం ప్రకటింపబడే ఆస్కారం ఉంది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే దాదాపు 300 మంది ఓట్లు వేసారని తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. చిరంజీవి నాగార్జున సాయి ధరమ్ తేజ్ నాగబాబు ఆర్ నారాయణమూర్తి రాజీవ్ కనకాల జీవితా రాజశేఖర్ హీరోయిన్ ప్రియమణి యాంకర్లు ఝాన్సీ సుమ తదితరులు ఓట్లు వేసారు. 

మరింతమంది ఆర్టిస్టులు ఈఆఖరి క్షణాలలో ఓట్లు వేసే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇప్పటికి కూడ ఫిలిం చాంబర్ బయట క్యూ లైన్ పెద్డదిగానే  కనిపిస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల హడావిడి ఇలా కొనసాగుతూ ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల బరిలో పోటీపడుతున్న ఇరు ప్యానెల్స్ కి నరేష్ శివాజీ రాజాలకు జీహెచ్ ఎంసీ పెద్ద షాక్ ని ఇచ్చింది. నిబంధలకు విరుద్ధంగా ఫిలిం చాంబర్ పరిసరాల్లో ఫ్లెక్సీలు పోస్టర్లు ఏర్పాటు చేసినందుకు వీరికి పెనాల్టీ వేయబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఇంకా కొంతమంది టాప్ సెలెబ్రెటీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది..      


మరింత సమాచారం తెలుసుకోండి: