మూవీ ఆర్టిస్టుల రాజకీయాలు వేరేగా ఉంటాయనుకోవడానికి వీలులేదు. అయితే అవి కాస్తా పాలిష్డ్ గా ఉంటాయంతే. అయిదు కోట్ల పైబడి ఫండ్స్ ఉన్న మా కు ఎన్నికలు అంటే ఓ సందడి. నిజానికి మన హీరోల పారితోషికం ఒక్కో సినిమాకు పది నుంచి ఇరవై కోట్ల పైమాటే. అయితే మా పదవులు డబ్బుల కోసం కాదు. గౌరవం కోసం. అందుకే ప్రతీ సారీ వీధి పోరాటాల స్థాయిలో మా ఎన్నికలు జరుగుతున్నాయి.


ఇక విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లుగా హోరా హోరీ పోరు ఈసారి జరిగింది. అటు శివాజీ రాజా ప్యానల్, ఇటు సీనియర్ హీరో నరేష్ ప్యానల్ మధ్య ధీటైన పోరే సాగింది. అయితే ఉన్నట్లుండి మెగా బ్రదర్ నాగబాబు నరేష్ ప్యానల్ కి మద్దతు ప్రకటించడంతో రాత్రికి రాత్రి సీన్ మారిందని అంతా అంటున్నారు. ఇక మరో సినీ నటుడు నాగార్జున, చిరంజీవి ఒకే కారులో రావడం, ఓట్లు వేయడంతో ఈ ఇద్దరూ ఒక వ్యూహం ప్రకారం మా ఎన్నికలను నడిపించారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.


శివాజీ రాజా ప్యానల్ కూడా ఏం తీసిపోలేదు. కానీ మెగా బ్రదర్ ప్లేట్ ఫిరాయించేసరికి బాగా డల్ అయింది. అయితే అందులోనూ ఉద్దండులు అనేక మంది ఉన్నారు. ఇక మా అంటే కేవలం కోట్లు తీసుకునే టాప్ స్టార్లు మాత్రమే కాదు. చిన్న ఆర్టిస్టులు ఎంతో మంది అందులో ఉన్నారు.



వారి ఓట్లే ఇపుడు కీలకం. దాదాపుగా 800 మంది వరకూ సభ్యులు కలిగిన మా ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. గతంలో లేనంతగా పోలింగ్ జరిగింది. టాప్ స్టార్లు అంతా తమ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. మొత్తానికి ఫలితాలు వచ్చే వరకూ ఎవరు గెలుస్తారో చెప్పలేకపోయినా నాగ్, చిరు వ్యూహం ఏంటి అన్నది ఫలితాలను బట్టి బేరీజు వేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: