సాధారణంగా మహేష్ రాజకీయాలకు దూరంగా ఉంటాడు. అతడి బావ గల్లా జయదేవ్ ఎన్నికల ప్రచారానికి కూడ మహేష్ ఎప్పుడు ఓపెన్ గా ప్రచారానికి వెళ్ళలేదు. అయితే ఈసారి జరిగిన ‘మా’ ఎన్నికలలో నరేశ్ విజయానికి మహేష్ అనుసరించిన వ్యూహం బాగా పనిచేసింది అన్నకామెంట్స్ వస్తున్నాయి.
‘మా' అధ్యక్షుడిగా నరేష్ ఎన్నిక
వాస్తవానికి ఈసారి జరిగిన ఎన్నికలలో చిరంజీవి ఎవరికీ సపోర్ట్ ఇవ్వకుండా ఎవరు నెగ్గినా తన ఆశీస్సులు ఉంటాయని ధర్మరాజు పాత్ర పోషించాడు. అయితే ‘మా’ సంస్థ ఎన్నికలు కేవలం మూడురోజులు ఉన్నాయి అనగా మహేష్ చిరంజీవికి చేసిన ఒక ఫోన్ కాల్ నరేశ్ కు అదృష్టంగా మారితే శివాజీ రాజాకు దురదృష్టంగా మారింది అని అంటున్నారు.
జీవిత, రాజశేఖర్ విజయం
వాస్తవానికి చిరంజీవికి మహేష్ అంటే అభిమానం ఉండటమే కాకుండా గత కొంతకాలంగా మహేష్ రామ్ చరణ్ లు సాన్నిహిత్యంగా ఉండటమే కాకుండా కొన్ని వ్యాపార సంబంధాలు చరణ్ మహేష్ ల మధ్య ఉన్నాయి అన్న వార్తలు కూడ ఉన్నాయి. ముఖ్యంగా నమ్రత ఉపాసనల మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం వల్ల ఆమధ్య ఈరెండు కుటుంబాలు ఒక ఫారెన్ ట్రిప్ లో కలిసి సందడి చేసిన సందర్భానికి సంబంధించిన వార్తలు కూడ వచ్చాయి.
Mahesh will surpass Chiranjeevi in fund-raising: Rivals
‘మా’ సంస్థ రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ ఈసారి నరేశ్ కోసం చిరంజీవిని రిక్వెస్ట్ చేయడంతో అప్పటి వరకు తటస్థంగా ఉన్న చిరంజీవి తన వ్యూహాలు మార్చి నాగబాబు చేత నరేశ్ ప్యానల్ కు మద్దతుగా ఒక ప్రకటన ఇప్పించి కేవలం మూడు రోజులలో నరేశ్ కు అనుకూలంగా చిరంజీవి వ్యూహాలు మార్చినట్లు టాక్. అంతేకాదు చిరంజీవి తన సన్నిహితులకు కూడ నరేశ్ ప్యానల్ కు తాను మద్దతు ఇస్తున్న విషయాన్ని పరోక్షంగా తెలియ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈవ్యూహాలకు తోడు నిన్న జరిగిన ‘మా’ ఎన్నికల పోలింగ్ కు చిరంజీవి నాగార్జునతో కలిసి ఓటు వేయడానికి రావడంతో ఈసారి కూడ మెగా కాంపౌండ్ ‘మా’ ఎన్నికలలో తన పట్టును చూపించడానికి వ్యూహాలు రచించింది అన్న విషయం స్పష్టం అయిపోయింది. దీనితో మెగా కుటుంబ అండతో ‘మా’ ఎన్నికలలో ఘట్టమనేని కుటుంబ పట్టును తెలియచేసే విధంగా ‘మా’ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: