‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయాడు ప్రభాస్. ఈనేపధ్యంలో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ కి వస్తున్న బిజినెస్ ఆఫర్స్ విని ‘బాహుబలి’ సృష్టికర్త రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో వ్యూహాలు మార్చుకునే స్థాయికి వెళ్ళవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘సాఫో’ కు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ‘సాహో’ రైట్స్ కు సంబంధించి మన తెలుగు రాష్ట్రాలలో ఈమూవీకి జరగబోయే బిజినెస్ పక్కకు పెట్టి ఈమూవీకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ అదేవిధంగా బాలీవుడ్  తమిళం మలయాళం వెర్షన్ల థియేట్రికల్ రైట్స్ తో పాటు ఈమూవీకి సంబంధించిన ప్రపంచవ్యాప్త హక్కుల కోసం ఒక భారీసంస్థ 240 కోట్లు ఆఫర్ చేసింది. అయితే ఆఆఫర్ ను ‘సాహో’ నిర్మాతలు రిజెక్ట్ చేసి 350 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. 

దీనితో ‘సాహో’ నిర్మాతల మితిమీరిన ఆత్మవిశ్వాసం పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు తెలుగురాష్ట్రాల బిజినెస్ ను పక్కకు పెట్టి ‘సాహో’ నిర్మాతలు ఈవిధంగా డిమాండ్ చేస్తున్నారు అంటే ‘సాహో’ టోటల్ బిజినెస్ 500 స్థాయికి మించి జరుగుతుందనీ ‘సాహో’ నిర్మాతలు కలగంటున్నారా  అంటూ కొందరు సెటైర్లు కూడ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ‘ఆర్ ఆర్ ఆర్’ కు ఇంకా ఇలాంటి భారీ ఆఫర్లు రాకపోవడంతో రాజమౌళి తన వ్యూహాలు మారుస్తున్నట్లు తెలుస్తోంది. 
Shades Of Saaho Teaser
త్వరలో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి హైదరాబాద్ లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈసినిమాలో నటించే పూర్తి నటీనటుల వివరాలు ఈమూవీ బడ్జెట్ అదేవిధంగా ఈమూవీ కథకు సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈసినిమా మొదలై ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయినా ఈమూవీ గురించి తనకు తానుగా రాజమౌళి అధికారికంగా ఇంకా ఏమి చెప్పని నేపధ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈమీడియా సమావేశం ద్వారా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి జాతీయస్థాయిలో భారీ మార్కెట్ ఆఫర్లు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయమై వచ్చేవిధంగా రాజమౌళి ఆలోచనలు ఉన్నాయి అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: