పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ నిన్న సోషల్ మీడియాలో హడావిడి చేసిన ఒక వాయిస్ క్లిపింగ్ సంచలనంగా మారడమే కాకుండా ఈ వాయిస్ క్లిపింగ్ వెనుక ఎవరి హస్తం ఉంది అన్న కోణంలో పవన్ అభిమానులలో టెన్షన్ పెరిగిపోయింది. ఆ వాయస్ క్లిపింగ్ లో మాట్లాడిన ఆ మహిళ తాను పవన్ కోసం పెళ్ళి కూడ మానుకున్నానని అయితే తనను పవన్ ఏమాత్రం పట్టించుకోలేదు అంటూ ఒక నటి వాయస్ గా చెపుతూ ఆమె పేరు చెప్పకుండా హడావిడి చేసిన ఆ వాయస్ క్లిపింగ్ ఎవరిదీ అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.
Pawan-Kalyan-Janasena-Party-Strength-Andhra-Pradesh
అయితే ఇది అంతా ఎవరో కావాలని పవన్ పై ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతడి పై బురద జల్లడానికి మరొకసారి ప్రయత్నిస్తున్నారు అంటూ పవన్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఒక జాతీయ మీడియా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ప్రభావితం చేసే వ్యక్తి ఎవరు అంటూ జరిపిన ఒక సర్వేలో పవన్ కు 15.7 శాతం ఓట్లు వచ్చాయి అని ఆ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనం ప్రచురించింది. 

గత కొంత కాలంగా రాబోతున్న ఎన్నికలలో పవన్ కు 5 నుంచి 7 శాతం లోపు ఓట్లు వస్తాయి అని గతంలో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇలా ఏకంగా పవన్ కు 15.7 శాతం ఓట్లు వస్తాయి అన్న కథనాలు చూసి ఇలాంటి నెగిటివ్ వాయిస్ క్లిపింగ్ ను పవన్ ను టార్గెట్ చేస్తూ ఎవరో కావాలని వ్యతిరేకులు ప్రచారంలోకి తీసుకు వచ్చి ఉంటారు అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి.  

ఇక నిన్న ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అన్ని ప్రముఖ రాజకీయ నాయకులకన్నా ఎక్కువగా పవన్ కు షాక్ అని అంటున్నారు. పవన్ అన్ని స్థానాలలోనూ పోటీ చేయకుండా కేవలం తనకు బలం ఉండే కొన్ని స్థానాలలో పోటీ చేయాలని భావిస్తున్న నేపధ్యంలో నిజంగా తనకు బలం ఉన్న స్థానాలు ఎంచుకునే టైమ్ గ్యాప్ కూడ లభించదని కేవలం ఒక నెల రోజులలో జరగబోతున్న ఈ ఎన్నికలలో పవన్ కనీస స్థానాలు అయినా గెలవాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: