కన్నడ రాకింగ్ స్టార్ యష్ కి ప్రాణ హాని ఉందని..అతన్ని చంపేందుకు కుట్ర పన్నుతున్నారని కన్నడనాట పుకార్లు పుట్టుకొచ్చాయి.  ఈ మద్య యష్ ని చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని..అతన్ని చంపాలని కొందరు ప్లాన్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్న నేపథ్యంలో హీరో యష్ స్పందించారు.   తనను ఎవరూ చంపాలనుకోవడం లేదని, ఈ విషయమై బెంగళూరు ఏసీపీతో ఇప్పటికే మాట్లాడానని పేర్కొన్నాడు. తనపై ఎటువంటి కుట్రలు జరగడం లేదన్నారు. గత కొన్ని రోజుల నుంచి మీడియాలో వస్తున్న వార్తలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని..ఈ వార్తల వల్ల తన కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారని..తన సన్నహితులు, అభిమానులు కలత చెందుతున్నారని, వదంతులతో బాధపడుతున్నారని యశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మీడియాలో వస్తున్న వార్తలతో చాలా మంది ఫ్యాన్స్ నాకు ఫోన్లు చేస్తున్నారని..ఈ ఫోన్లు పదే పదే రావడంతో తాను కూడా విసిగిపోతున్నానని అన్నారు. ఎవరైనా ఓ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.  చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని..కాంపిటీషన్ ఉంటుందని..అలాంటి వాటిని కొందరు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారని..మున్ముందు వీటి వల్ల ఎటువంటి ఘటనలు జరుగుతాయోనని భయంగా ఉందన్నాడు.

తాను ఎవరికీ అన్యాయం చేయలేదని..ద్రోహం చేసే మనస్థత్వం కాదని..కష్టపడి పైకి వచ్చానని..అసలు తనకు ప్రాణహాని ఉందన్న వార్తలను మీడియాకు ఎవరు చేరవేస్తున్నారో తనకు తెలియడం లేదన్నారు. ఎవడు పడితే వాడొచ్చి నరికేయడానికి తాను గొర్రెను కానని యశ్ తేల్చి చెప్పాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: