తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 1, 2 లు వచ్చాయి.  బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు.  ఆ సమయంలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సాఫీగా సాగిపోయింది.  బిగ్ బాస్ సీజన్ 1 కి శివబాలాజీ విజేతగా నిలిచారు.  ఇక బిగ్ బాస్ సీజన్ 2 లో ముగ్గురు సామాన్యులు కూడా ఎంట్రీ ఇచ్చారు.  వీరిలో మొదటి వారానికే సంజన వెళ్లిపోగా కొన్ని ఎపిసోడ్ల తర్వాత నూతన్ నాయుడు, గణేష్ లు వెనుతిరిగారు.  బిగ్ బాస్ 2 లో మొదటి నుంచి చివరి వరకు ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. 
Image result for bigg boss telugu 2
ఇందులో ఇంటి సభ్యులు కౌశల్ కి బయట  కౌశల్ ఆర్మీ ఏర్పడింది.  దాంతో బిగ్ బాస్ లో ఎవరిని నామిటేట్ చేయాలన్నా కౌశల్ ఆర్మీ నిర్ణయిస్తుందని టాక్ వినిపించింది. అయితే బిగ్ బాస్ ఇంటి సభ్యులైన బాగు గోగినేని, తనిష్ లతో కౌశల్ పలు సందర్భాల్లో గొడవలు పెట్టుకున్న విషయం తెలిసిందే.  ఆ సమయంలో కౌశల్ ధోరణి పట్ల నాని దగ్గర బాబు గోగినేని అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు వున్నాయి.  ‘బిగ్ బాస్ 2’ విజేతగా కౌశల్ నిలవడంలో కౌశల్ ఆర్మీ ప్రధానమైన పాత్రను పోషించింది. అలాంటి కౌశల్ ఆర్మీ కొన్ని రోజులుగా కౌశల్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది.   
Image result for babu gogineni koushal
అయితే తనపై వస్తున్న ఆరోపణలు కౌశల్ ఎప్పటికప్పుడూ ఖండిస్తూనే వస్తున్నాడు.  తాజాగా ఈ విషయంపై బాబు గోగినేని స్పందించారు.  బిగ్ బాస్ సీజన్ 2 వస్తున్న సమయంలో ప్రస్తుతం కౌశల్ ఆర్మీ గుట్టు రట్టు అయిన విషయాన్ని గురించి ప్రస్తావించారు. గతంలో తన వాదనను కొట్టి పారేస్తూ కౌశల్ ని సమర్థించిన నాని, ప్రస్తుత వివాదంపై వెంటనే స్పందించాలని అన్నారు. మరి బాబు గోగినేని చేస్తున్న వ్యాఖ్యలకు నాని ఏలా స్పందిస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: