తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మద్య వరుసగా సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు.  హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా రజినీకాంత్ సినిమాలంటే ఏదో ఒక ప్రత్యేక  ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తుంటారు.  ఇప్పటికీ ఆయన నటన అంటే పిచ్చెక్కి పోయేవారు ఎంతో మంది ఉన్నారు.  ఇటీవల ఆయన నటించిన పెట్టా తెలుగు, తమిళంలో రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాలో రజినీ చాలా యంగ్ గా కనిపించి హుషారెత్తించారు.  కబాలి, కాలా, పేటా సినిమాలతో వరుసగా నటిస్తూ వస్తున్న రజినీకాంత్ మురుగదాస్ తో సినిమా చేయడానికి రంగంలోకి దిగుతున్నారు.
Image result for kabali
ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కథా పరంగా ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుందట. గతంలో రజినీకాంత్ ముంబాయి నేపథ్యంలో భాష, కాలా సినిమాలు చేసిన విషయం తెలిసిందే.  ఇందులో భాష ఎవర్ గ్రీన్ హిట్ అయ్యింది.  ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించ బోతున్నారు.  గతంలో వచ్చిన సినిమాల్లో ఆయన డాన్ గా నటించిన విషయం తెలిసిందే. 
Image result for rajinikanth murugadoss
ప్రభుత్వ వ్యవస్థలోని లొసుగులను ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడే కొందరిపై పోరాటం చేసేవాడిగా ఆయన కనిపిస్తాడని అంటున్నారు. ఈ పాత్రను మురుగదాస్ అద్భుతంగా మలిచాడనీ, రజనీ అభిమానుల అంచనాలను అందుకునేలా ఆయన కథాకథనాలను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇక గతంలో మురుగదాస్ చేసిన కత్తి, గజనీ సినిమాలు ముంబై నేపథ్యంలోనే తెరకెక్కిన విషయం తెలిసిందే


మరింత సమాచారం తెలుసుకోండి: