నిర్మాత కరణ్ జోహర్ రూపొందిస్తున్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’ ఈమూవీ పై చాలా భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్ అలియాభట్ అమితాబ్ బచ్చన్ నాగార్జున తదితరులు నటిస్తున్న ఈ మూవీ పై 150 కోట్లు భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు. ఈమూవీలో నాగార్జున ఒక కీలపాత్ర చేవ్స్తున్న నేపధ్యం లో ఈమూవీని తెలుగులోకి డబ్ చేస్తున్నారు.
రూ.150 కోట్ల బడ్జెట్‌తో
ఈమూవీకి మరింత క్రేజ్ తీసుకురావడానికి ఈమూవీ తెలుగు లోగో ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేశాడు. ఈమూవీ టైటిల్ లోగోను లాంచ్ చేసిన తరువాత రాజమౌళి ఈమూవీకి సంబంధించిన ట్విట్ అందరికీ కనెక్ట్ అవుతోంది. 
Karan Johar, Rajamouli Friendship
‘మన ఉనికి గర్వం. చరిత్రకు అది శిఖరం. బ్రహ్మండంలో ఉన్న శక్తి అంతటికి స్థావరం. అదే బ్రహ్మస్త్రం' అంటూ ఈ మూవీలోని డైలాగ్స్ తనకు ఎంతో నచ్చాయి అంటూ రాజమౌళి ట్విట్ చేయడమే కాకుండా ఈమూవీ నిర్మాత కరణ్ జోహార్ పై విపరీతంగాప్రశంసలు కురిపించాడు. 

రాజమౌళి మెచ్చిన
‘బాహుబలి’ పార్ట్ 2 విడుదల తరువాత కరణ్ జోహార్ రాజమౌళిల మధ్య దూరం పెరిగింది అని గతంలో గాసిప్పులు వచ్చాయి. దీనికి మరింత బలం చేకూరుస్తు తాను ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని బాలీవుడ్ లో విడుదల చేయడంలేదని కరణ్ జోహార్ ఆమధ్య మీడియాకు లీకులు ఇచ్చాడు. అయితే ఈమధ్య మళ్ళీ సాన్నిహిత్యం పెరగడమే కాకుండా కొన్నిరోజుల క్రితం కరణ్ జోహార్ రాజమౌళి ప్రభాస్ రానాలను తన ‘కాఫీ విత్ కరణ్’ షోకు ఆహ్వానించడంతో పాటు ఇప్పుడు తన ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్ లోగోను రాజమౌళి చేత ఆవిష్కరించడంతో తిరిగి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడమే కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ కు కరణ్ జోహార్ సపోర్ట్ దొరకడం ఖాయం అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: