ఈ మద్య కొంత మంది హీరోలు చేస్తున్న అతి వల్ల ఎన్నో ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు.  ఆ మద్య షూటింగ్ సమయంలో కారు ప్రమాదంలో గోపిచంద్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.  గతంలో మంచు విష్ణు బైక్ రేస్ చేస్తుండగా ప్రమాదం జరిగి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ఇలా పలువురు హీరోలు ఆపదలు కొని తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే.  ఇక అభిమానుల విషయానికి వస్తే..తమ హీరో మంచి స్టెప్పులేస్తే..సూపర్ గా ఫైట్ చేస్తే థియేటర్లో విజిళ్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు.  ఇందుకోసం హీరోలు కూడా కొంచెం రిస్క్ అయినా..కష్టపడుతుంటారు.  ఫ్యాన్స్ ని మెప్పించాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో హీరో విశాల్ గాయపడ్డారు. 

 వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం వెంకట్ మోహన్ దర్శకత్వంలో విశాల్ ‘అయోగ్య ’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూరి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ మూవీ రిమేక్.  దాదాపు ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా రిమేక్ చేస్తున్నట్లు సమాచారం.  అయితే ఇందులో ఓ ఐటమ్ సాంగ్ ఉంటే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించారట.

దాంతో సరైనోడు సినిమాలో హిట్ అయిన బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే సాంగ్ పాట చిత్రీకరిస్తున్నారట.  ఒక కష్టమైన స్టెప్ ను ప్రాక్టీస్ చేసే సమయంలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు.  గతంలో ఫైట్ సీన్లు చేస్తున్న సమయంలో కూడా విశాల్ గాయపడ్డారు.  ఈ ప్రమాదంలో ఆయన మోచేతికి, కాలికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న విశాల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: