కమెడియన్ అలీ నిన్న జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ పవన్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తే పవన్ కు అనుకూలంగా రానున్న రోజులలో అలీ మంత్రాంగం చేయబోతున్నాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలీ నిన్న మీడియా వర్గాలతో మాట్లాడుతూ పవన్ సలహాతో తాను ‘జనసేన’ లో చేరలేదు అన్న విషయం వివరించి అందరికీ షాక్ ఇచ్చాడు. 
Comedian Ali
అంతేకాదు తనతో రాజకీయ ప్రయాణం అంటే అది ముళ్ళదారి అని ఆదారిలో నడవాలి అంటే చాల సహనం ఉండాలి అంటూ పవన్ తనకు సలహా ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా తాను పవన్ వీరాభిమానిని మాత్రమే కాకుండా పవన్ కు నిరంతరం శ్రేయోభిలాషిని అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు అలీ. 
pawan-kalyan-at-vizag-airport-for-uddanam-tour-photos-stills-7
దీనితో అలీ నిజంగానే పవన్ ను వదులుకుని జగన్ పార్టీలో చేరాడా లేదంటే ఏదో ఒక విషయంలో పవన్ జగన్ ల మధ్య రాయబారాలు చేసే వ్యూహాత్మక అస్త్రంగా రానున్న రోజులలో అలీ మారబోతున్నాడా అంటూ ఇండస్ట్రీలోని కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. ఇది ఇలా ఉండగా మొన్నరాత్రి కొంతమంది రాజకీయ నేపధ్యం ఉన్న సినీ ప్రముఖులు ఒక ప్రముఖ వ్యక్తి ఇంట్లో కలిసి రానున్న ఎన్నికలలో గోదావరి జిల్లాలలో ఓట్లు చీలిపోకుండా ఉండాలి అంటే పవన్ జగన్ ల మధ్య ఒక ఎన్నికల సద్దుబాటు అవసరం అని భావిస్తున్నట్లు టాక్. 
pawan-kalyan-at-vizag-airport-for-uddanam-tour-photos-stills-9
దీనితో మెగా కాంపౌండ్ కు సన్నిహితులైన ఆ ప్రముఖులు తమ అభిప్రాయాలను చిరంజీవి ద్వారా పవన్ కు చేరవేయాలని తమవంతు  ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. రాబోతున్న ఎన్నికలలో గోదావరి జిల్లాలలో పవన్ కు పెరుగుతున్న ఆదరణ వల్ల ఓట్లు చీలిపోయే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎన్నికల తరువాత కాకుండా ఎన్నికల ముందు మేల్కొని పవన్ వాస్తవ దృష్టితో తన శక్తిని అంచనా వేసుకుని వ్యవహరించి జగన్ తో సద్దుబాటు చేసుకునే విషయంలో వస్తున్న సూచనలు ఎంత వరకు పవన్ జగన్ లకు ఆచరణనీయం ఈవిషయంలో అలీ పవన్ కు ఏమైనా సంకేతాలు పంపుతాడా అన్న విషయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: