నిహారిక సినిమాలలో కంటే ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియాలో బిజీగా ఉంటోంది. ఆమెకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్న నేపధ్యంలో ఆమె చేసే కామెంట్స్ వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థుతులలో నిహారిక తాను ఒక బార్ పై పెంచుకున్న మోజును బయటపెట్టడంతో ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 
సూర్యకాంతం
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే వైజాగ్ లో బేకర్స్ కాస్టల్ అనే డెసర్ట్ బార్ ఉంది. అక్కడ ఉండే రకరకాల డెసర్ట్స్ ట్రై చేయకపోతే జీవితం వృధా అని అంటోంది ఈమెగా డాటర్. ఈమె మంచి ఫుడ్ లవర్ కావడంతో నిహారిక ఏఊరు వెళ్ళినా ఆ ఊరులోని ప్రముఖ హోటల్స్ గురించి అదేవిధంగా ప్రముఖ బేకర్స్ గురించి తెలుసుకుని వాటికి వెళ్ళడమే కాకుండా అక్కడ ఫుడ్ ను టెస్ట్ చేయడం ఆమె అలవాటు. 
మార్చి 29 రిలీజ్
ఈ అలవాటులో భాగంగా ఈమె ఈమధ్య బేకర్స్ కాస్టల్ డెసర్ట్ బార్ కు వెళ్ళి అక్కడ రకరకాల స్వీట్స్ ను టెస్ట్ చేసి ఆమె ఆనందపడుతూ ఆ బార్ కు వెళ్ళకపోతే జీవితం వృధా అంటూ కామెంట్స్ చేసింది. దీనితో నిహారిక పుణ్యమా అని  ఆ డెసర్ట్ బార్ కు విపరీతమైన పబ్లిసిటీ ఏర్పడింది. అంతేకాదు ఈ డెసర్ట్ బార్ లో స్వీట్స్ కోసం తాను వైజాగ్ లో ఇల్లు కొనుక్కుని ఉండిపోవాలని ఉంది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 
వైజాగ్‌లోనే ఇల్లు కొంటా
ఇది ఇలా ఉండగా నిహారిక నటిస్తున్న సూర్యకాంతం మూవీ ఈనెల మార్చి 29న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో నిహారికతో 'ముద్దపప్పు ఆవకాయ' లాంటి వెబ్ సిరీస్ తీసిన ప్రణీత్ దర్శకత్వంలో 'సూర్యకాంతం' నిర్మిప పడింది. ఈ మూవీతో తనకు మరింత క్రేజ్ వస్తుందని నిహారిక కలలు కంటోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: