నందమూరి కళ్యాణ్ రామ్ సుధీర్ఘ కెరియర్ లో చేసిన సాహసాలు మరి ఏహీరో చేసి ఉండడు. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 16సంవత్సరాలు దాటిపోయినా అతడు నటించిన సినిమాలలో హిట్లు కేవలం మూడు మాత్రమే. ఇలాంటి పరిస్థితులు ఏహీరోకి అయినా ఎదురై ఉంటే ఆ హీరో పేరును కూడ జనం ఎప్పుడో మరిచిపోయి ఉండేవారు. తనకు పరాజయాలు ఎదురౌతున్న కొద్దీ వాటిని లెక్క చేయకుండా తనకు తానే నిర్మాతగా మారి సినిమాలు తీసి సాహసం చేసిన కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా చాkalyan ram in 118 teaserల చేదు అనుభవాలు ఉన్నాయి. 

అతడు నిర్మాతగా మారి నిర్మించిన ‘హరే రామ్’ ‘ఓం త్రీడీ’ ‘కత్తి’ ‘కిక్ 2’ లాంటి సినిమాలు ఘోర పరాజయం చెందడంతో నిర్మాతగా కళ్యాణ్ రామ్ కోట్ల రూపాయలలో నష్టపోయాడు అని అంటారు. ‘కిక్ 2’ విడుదల తరువాత కళ్యాణ్ రామ్ కు విపరీతమైన నష్టాలు ఏర్పడటంతో అప్పట్లో ఆ నష్టాలకు జూనియర్ హామీ పడ్డాడు అన్న వార్తలు కూడ వచ్చాయి. అయితే కళ్యాణ్ రామ్ జరిగిన నష్టాలతో ఇప్పుడు కొంత వరకు కుదుటపడి బయట బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు. 
118 movie three days collections
‘118’ ఇచ్చిన సక్సస్ తో మరో రెండు సినిమాలలో నటించడానికి కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాడు అని వార్తలు కూడ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ మరో భారీ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాడు అని వార్తలు రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో త్వరలో ‘అశ్వత్థామ’ అనే సినిమా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీని అత్యంత భారీ బడ్జెట్ తో తీయబోతున్నారని టాక్. 

ఇది ఒక చారిత్రక నేపధ్యం ఉన్న సినిమా అనీ వివిధ కాలాల్లో నడిచే కథ అని అంటున్నారు. ఈమూవీ కథలో తుగ్లక్ కాలంలో కూడా కొంత భాగం ఉంటుందట. అయితే దీనికి ‘తుగ్లక్’ అన్న టైటిల్ పెట్టకుండా ‘అశ్వత్థామ’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పేరున్న నటీనటులు టెక్నీషియన్లతో పెద్ద బడ్జెట్లో సినిమా తీయడానికి కళ్యాణ్ రామ్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వార్తలు జూనియర్ వరకు వెళ్ళడంతో కళ్యాణ్ రామ్ సాహసానికి జూనియర్ షాక్ అయి అడ్డుపడుతున్నట్లు ఇండస్ట్రీలో గాసిప్పులు  హడావిడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: