డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తాడు. మ్యాక్సిమం తన సినిమాలను మాత్రమే నిర్మించే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ కోసం పూర్తిస్థాయి నిర్మాతగా మారాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసిన ఆకాష్ పూరి మెహబూబా సినిమాతో ఫుల్ టైం హీరోగా మారాడు.


ప్రస్తుతం అనీల్ డైరక్షన్ లో రొమాంటిక్ సినిమా చేస్తున్న ఆకాష్ పూరి సినిమాలో హాట్ బ్యూటీ కెతిక శర్మతో రొమాన్స్ చేస్తున్నాడట. ఇప్పటికే ఫేస్ బుక్ లో తన అందాలతో దుమ్ముదులిపేస్తున్న కేతిక శర్మ ఆకాష్ పూరితో అదిరిపోయే రొమాన్స్ చేస్తుందట. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది.


ఈ సినిమాలో హీరోయిన్ ను పరిచయం చేస్తూ చార్మి ట్విట్టర్ లో మెసేజ్ పెట్టింది. హాట్ అండ్ హాట్ కెతిక ఫర్ రొమాంటిక్ మూవీ అని పెట్టింది. మరి కత్తిలాంటి పిల్లతో ఆకాష్ పూరి చేస్తున్న ఈ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం యువత మెప్పించే అంశాలు సినిమాలో ఉంటే సినిమాను హిట్ చేస్తున్నారు. 


మరి టైటిల్ లోనే రొమాన్స్ ఉంది.. అందులోనూ కెతిక లాంటి హాట్ బ్యూటీ నటిస్తుంది. కాబట్టి తెలుగు ప్రేక్షకులకు మరోసారి అదిరిపోయే ఘాటు రొమాన్స్ సినిమా వస్తుందని చెప్పాలి. రొమాంటిక్ మూవీ మే లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరి పూరి కొడుకు ఆకాష్ హీరోగా నిలబడతాడో లేదో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: