చదువుకి సంపాదనకు తెలివితేటలకు ఎటువంటి సంబంధం ఉండదు. ఈవిషయానికి సంబంధించి మరొకసారి రానా ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చదువుతో పాటు చరణ్ ప్రభాస్ చదువుల గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగానికే కాకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్న రానా మీడియాతో మాట్లాడుతూ తన దృష్టిలో చదువుకుంటే కష్టపడే మనస్తత్వం ఎక్కువ ముఖ్యం అంటూ కామెంట్స్ చేసాడు. 

రానా ఆరోగ్యం పై షాకింగ్ కథనాన్ని ప్రచురించిన జాతీయ మీడియా !
అంతేకాదు తాను మాత్రమే కాకుండా ప్రభాస్ చరణ్ లు కూడ 10వ తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విషయాలను వివరిస్తూ అప్పటి రోజులలో తమ తల్లి తండ్రులు తమ గురించి పడ్డ టెన్షన్ గురించి వివరించాడు. తాను టెన్త్ క్లాస్ ఫెయిల్ అవ్వడంతో తన తాత రామానాయుడు తనను వేరే స్కూల్ కు మార్చిన సంఘటనను గుర్తుకు చేసుకుంటూ అక్కడ తనకు చరణ్ పరిచయం అయిన విషయాలను వివరించాడు. 

రానా ఆరోగ్యం పై షాకింగ్ కథనాన్ని ప్రచురించిన జాతీయ మీడియా !
అయితే ఆ స్కూల్ ద్వారా తాను రామ్ చరణ్ లు టెన్త్ పరీక్షలు వ్రాసినా ఫెయిల్ అయిన విషయాలను బయటపెట్టాడు. అయితే ఆతరువాత తామిద్దరం చదువులో రాణించలేమని తెలుసుకుని నెమ్మదిగా సినిమాల వైపు అడుగులు వేస్తూ తాము ఈ రంగంలో విజయం సాధించి తీరాలి అన్న పట్టుదలతో రోజుకు 12 గంటలు నటన గురించి డాన్స్ గురించి తామిద్దరం రకరకాల ట్యూషన్స్ కు వెళుతూ ఈరోజు కోట్ల సంపాదన స్థాయికి ఎదిగిన విషయాలను వివరించాడు రానా. ‘బాహుబలి’ మూవీ షూటింగ్ సమయంలో గంటలు గంటలు రాజమౌళి టార్చర్ ను భరిస్తూ తాను అసహనానికి గురైన పరిస్థుతులలో తనతో కలిసి నటిస్తున్న ప్రభాస్ ఓర్పును చూసి షాక్ అయి ‘మీరు ఏమి చదువుకున్నారు’ అంటూ తాను మొదట్లో ప్రభాస్ ను ప్రశ్నించినప్పుడు తాను కూడ టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్ధిని అని చెప్పడంతో తన మైండ్ బ్లాంక్ అయిన విషయాన్ని వివరించాడు రానా. 

రానా ఆరోగ్యం పై షాకింగ్ కథనాన్ని ప్రచురించిన జాతీయ మీడియా !
ఆ సంఘటన తరువాత తాను ఎవరు ఏమి చదువుకున్నారు అని ప్రశ్నించడం మానివేసి ఆ వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడు అన్న విషయాల పై దృష్టి పెట్టడం మొదలుపెట్టిన విషయాలను బయటపెట్టాడు రానా. ఈ మాటలు రానా యధాలాపంగా అన్నవే అయినా కేవలం పరీక్షలలో మార్కులు రాలేదని నిరాశపడి ఆతమహత్యలు చేసుకుంటున్న విద్యార్ధులను ఆలోచించే విధంగా మారుస్తాయి. ఒక వ్యక్తి ఎదగడానికి కృషి ఓర్పు సహనం తరువాత స్థానం మాత్రమే విద్యకు వస్తుంది అన్న భావం రానా మాటలలో ద్వనిస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: