టాలీవుడ్ లో హోరో హరీగా జరిగిన మా ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డ విషయం తెలిసిందే. మొదటి నుంచి నటుడు శివాజీరాజా, నరేష్ ల మద్య పోరు ఉత్కంఠంగా కొనసాగింది.  ఎవరికి వారే తమ విజయం పై ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.  ఈ సదర్భంగా మా అసోసియేషన్ లో శివాజీరాజా ఎన్నికైనప్పటి నుంచి సాధించిన అంశాలు ఏవీ లేవని...సురేష్ ప్యానల్ ప్రచారం చేస్తూ వచ్చింది. 
Image result for maa elections 2019
మరోవైపు శివాజీరాజా తాను మా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పలు అంశాలపై దృష్టి పెట్టానని ఇప్పటి వరకు తనపై ఎలాంటి ఆరోపణలు రాలేదని తన నిజాయితీనే తనను గెలిపిస్తుందని చెప్పారు.  విశేషమేమంటే..గత పాలక మండలిలో నరేష్, శివాజీరాజా ఇద్దరు మిత్రులుగా కొనసాగారు.  ఈసారి మాత్రం ప్రత్యర్థులుగా పోటీలో దిగారు.   అయితే శివాజీరాజా ఓటమికి 5 కారణాలు ఉన్నట్టు సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
 Image result for maa elections 2019
1. ఎన్నికలకు ఒకరోజు ముందు జరిగిన పరిణామాల్లో గెలుపు ఎవరిదీ అన్న విషయం తేలిపోయింది.  మెగా బ్రదర్ నాగబాబు ఒక్కసారిగా బయటకు వచ్చి తాను నరేష్ వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.  దాంతో చిరు కుటుంబ సభ్యులు..అతని అనుచరుల మద్దతు నరేష్ కే అని తేలిపోయింది.  అప్పట్లో పవన్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మా అసోసియేషన్ సరిగా స్పందించలేదని ఆ విషయంలో తాను హర్ట్ అయ్యానని నాగబాబు తెలిపారు..ఇదే శివాజీరాజ ఓటమికి ఓ కారణం అయ్యింది.
Image result for maa elections 2019
2.శివాజీరాజా పై మా సభ్యులకు వ్యతిరేకత లేదు..కాకపోతే శ్రీరెడ్డి మా అసోసియేషన్ కార్డు కూడా ఇచ్చారు.  ఈ విషయంపై అల్లు అరవింత్, పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, నాగ బాబు చాలా సీరియస్ అయ్యారు.  పవన్ కి అంత డ్యామేజ్ చేసిన శ్రీరెడ్డి విషయంలో ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకోక పోవడం శివాజీరాజాకు మైనస్ పాయింట్ అయ్యింది. 
Image result for maa elections 2019
3.శివాజీరాజా విషయంలో నాగబాబు తో  మెగాస్టార్ చిరంజీవి కూడా ఏకీభవించినట్లు తెలుస్తుంది.  ఈ నేపథ్యంలో నరేష్ ప్యానల్ కే చిరంజీవి సపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది.  ఇక చిరంజీవి సపోర్ట్ చేసిన వారే మా ఎన్నికల్లో గెలుస్తారని టాక్ ఉంది..ఇప్పుడు అదే ఈ ఎన్నికల్లో కూడా జరిగింది. 

4. మహేష్ బాబు వంటి స్టార్ హీరో కూడా శివాజీరాజాకు మద్దతు పలకలేదు.  అంతే కాదు మహేష్ బాబు ని నరేష్ ముందే తన ప్యానెల్ తో కలిసి హామీ తీసుకున్నారు.  అంతే కాదు గతంలో మహేష్ ఫార్ ఈవెంట్ అర్థాంతరంగా ఆగిపోయింది..దీనిపై మహేష్ అసంతృప్తిగా ఉన్నారు.  ఇక విజయ నిర్మల, కృష్ణ ఎలాగూ నరేష్ ప్యానెల్ కే ఓటు వేసి తీరుతారు.  

5.ఈ సారి పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పోటీ జరగలేదు. శివాజీరాజాను వ్యతిరేకిస్తున్న వారు పెద్ద ఎత్తున పోలీంగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: