ఈనెల 14న రాజమౌళి తన 'ఆర్ ఆర్ ఆర్' కు సంబంధించి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మీడియా సమావేశానికి తెలుగు మీడియా వర్గాలను మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో ప్రముఖంగా ఉన్న అనేక మీడియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటి వరకు 'ఆర్ ఆర్ ఆర్' కు సంబంధించి రాజమౌళి ఏ విషయం అధికారికంగా ప్రకటించలేదు. దీనికితోడు ఈమూవీ ప్రారంభోత్సవానికి కూడ రాజమౌళి మీడియాను దూరంగా పెట్టాడు. దీనితో ఇప్పటి వరకు ఈసినిమాకు సంబంధించిన గాసిప్పులు హడావిడి చేశాయి కానీ రాజమౌళి నోటివెంట 'ఆర్ ఆర్ ఆర్' కు సంబంధించిన ఒక్క విషయం కూడ బయటకు రాలేదు. 
After Kiliki, Jakanna Team Pens New Language In RRR
ఇది ఇలా ఇండగా ఈసినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆలీయా భట్ తో రాయబారాలు జరిగినట్లు ఈమూవీలో నటించడానికి అలియా భట్ కు ఎక్కువ పారితోషికం ఇచ్చినా ఆమె తిరస్కరించినట్లు మీడియాలో వార్తలు రావడంతో ఆ విషయాలకు రాజమౌళి చాలా హర్ట్ అయినట్లు టాక్. దీనికితోడు బాలీవుడ్ టాప్ హీరో అజయ్ దేవగన్  'ఆర్ ఆర్ ఆర్' నటిస్తున్నట్లుగా వచ్చిన వార్తలను ఖండిస్తూ ఈమధ్య కామెంట్స్ చేయడం కూడ రాజమౌళికి అసౌకర్యంగా మారినట్లు తెలుస్తోంది. 

ఈ పరిస్థుతులలో బాలీవుడ్ హీరోయిన్ ప్రణీతీ చౌప్రాను బాలీవుడ్ మీడియా ప్రశ్నించినప్పుడు ఆమె 'ఆర్ ఆర్ ఆర్' విషయం గురించి స్పష్టత ఇవ్వకుండా మరి కొన్నిరోజుల తరువాత మాత్రమే ఈ విషయం పై  తాను స్పందిస్తానని ప్రస్తుతం తన సినిమాల బిజీ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' తాను స్పష్టత ఇవ్వలేను అంటూ బాలీవుడ్ మీడియాతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాదికి సంబంధించిన నటీనటులు అంతా రాజమౌళి సినిమాలలో అవకాశాల గురించి ఎదురు చూస్తుంటే బాలీవుడ్ స్టార్స్ 'ఆర్ ఆర్ ఆర్' విషయంలో రాజమౌళికి చుక్కలు చూపెడుతున్నారు అని వస్తున్న గాసిప్పులకు చెక్ పెట్టి ఈమూవీ కథను తదితర విషయాలను ఈమూవీ రిలీజ్ కాబోయే టైమ్ స్థూలంగా వివరించి ఈమూవీకి జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పడే విధంగా రాజమౌళి ఈ మీడియా సమావేశాన్ని ఒక ఆయుధంగా మార్చుకోబోతున్నట్లు టాక్.. 
.


మరింత సమాచారం తెలుసుకోండి: