వివాదాలకు నిరంతర చిరునామాగా కొనసాగే రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రైట్స్ ను టోటల్ గా బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్ హెచ్ స్టూడియోస్ కు అప్పచెప్పడం వెనుక వర్మలో బయటపడని అబధ్రతా భావం కీలక పాత్ర వహించింది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో నందమూరి ఫ్యామిలీ అదేవిధంగా తెలుగుదేశ అధినాయకత్వం పెద్దగా పట్టించుకోదు అన్న లీకులు వస్తున్నా ఈ విషయాలను పూర్తిగా వర్మ నమ్మలేక పోతున్నాడు అని టాక్. 
ఓవర్సీస్ రైట్స్ ఎవరికంటే..
దీనితో ఈమూవీ రిలీజ్ చేసే విషయంలో తెలుగు రాష్ట్రాలలోని ఏ డిస్ట్రిబ్యూటర్ ను పూర్తిగా వర్మ నమ్మలేని పరిస్థితిలో ఉండటంతో వర్మ ఎవరూ ఊహించని విధంగా ఈమూవీ రైట్స్ ను ఎన్ హెచ్ స్టూడియోస్ కు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో పేరుగాంచిన ఈ సంస్థ ఇప్పటికే ‘పింక్’ ‘శివాయ్’ ‘ట్యూబ్ లైట్’ ‘జబ్ హ్యారీ మెట్ సెజల్ బేగం జాన్’ ‘డియర్ జిందగీ’ ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి బాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడమే కాకుండా ఈ సంస్థ  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో తెలుగు మార్కెట్లోకి ఎంటరవుతూ ఈమూవీ పబ్లిసిటీని భారీ ఎత్తున చేయబోతున్నట్లు తెలుస్తోంది. 
కుటుంబ కుట్రల చిత్రం
వాస్తవానికి ఈసినిమాను కొనడానికి చాలామంది ప్రయత్నించినా ఆ ఆఫర్లను వదులుకుని మొత్తం బాధ్యత అంతా ఈ బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అప్పచేప్పడంలో వర్మ భవిష్యత్ వ్యూహాలు ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ అనుకోకుండా ఈ మూవీ విడుదల అయ్యాక వివాదాలు పెరిగిపోతే ఆ వివాదాల బాధ్యతను వర్మ తెలివిగా ఈ బాలీవుడ్ సంస్థకు అంటకట్టాలని వర్మ ప్లాన్ అని అంటున్నారు. 
లక్ష్మీస్ ఎన్టీఆర్
అయితే ఇప్పటికే ఈసినిమాలో నందమూరి అభిమానులు భయపడే రేంజ్ లో సన్నివేశాలు ఉండవు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో వర్మ అనుసరిస్తున్న ఈ కొత్త వ్యూహం దేనికి సంకేతం అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈమూవీ విడుదల అవుతున్న నేపధ్యంలో ఎదో ఒక మ్యాజిక్ ఈమూవీలో వర్మ చేసి ఉంటాడు కాబట్టి వర్మ తనకు తానుగా వివాదాలకు టార్గెట్ కాకుండా కొంత వరకు తప్పించుకునే ప్రయత్నాలలో భాగమే ఈ ఎత్తుగడ అంటూ మరికొందరు ఈవిషయాలను విశ్లేషిస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: