అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ ప్రాజెక్ట్ ప్రకటింపబడి నాలుగు నెలలు దాటిపోతున్నా ఈమూవీ స్క్రిప్ట్ విషయమై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాకపోవడం త్రివిక్రమ్ ను కూడ కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమూవీ కథ విషయమై అనేకమార్పులు చేర్పులు జరిగిన తరువాత కూడ ఈమూవీ సెకండ్ ఆఫ్ కథకు సంబంధించిన విషయంలో ఇంకా స్పష్టమైన క్లారిటీ బన్నీ త్రివిక్రమ్ ల మధ్య రాలేదు అని టాక్. 
Trivikram Penning Witty Lines For Bunny?
ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కు ఇచ్చిన 60 టార్గెట్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కేవలం 60రోజుల డేట్స్ మాత్రమే త్రివిక్రమ్ కు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డేట్స్ కూడ త్రివిక్రమ్ మే నెల నుండి జూలై నెల లోపు వచ్చే మూడు నెలలలో త్రివిక్రమ్ బన్నీ ఇచ్చిన 60 రోజుల డేట్స్ ఉపయోగించు కోవాలని కండిషన్స్ పెడుతున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

‘అరవింద సమేత’ రికార్డుల పరంగా ఊహించిన స్థాయిలో విజయం సాధించని నేపధ్యంలో త్రివిక్రమ్ మితిమీరిన జాగ్రత్తలు తీసుకుంటూ బన్నీ సినిమా విషయంలో విపరీతమైన ఆలస్యం చేస్తాడు అన్న ఉద్దేశ్యంతో ఈకండిషన్స్ త్రివిక్రమ్ కు అల్లు కాంపౌండ్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనితో ఎలర్ట్ అయిన త్రివిక్రమ్ ఈమూవీకి సంబంధించి ప్రి ప్రొడక్షన్‌కు కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నా పక్కాగా షెడ్యూల్స్ వేసుకుని తక్కువ వర్కింగ్ డేస్‌ లో ఈసినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. 
ఈ విషయంలో సస్పెన్స్ లో పెట్టిన బన్నీ చిత్రబృందం
గతంలో త్రివిక్రమ్ ఒక సినిమాను చాల లేట్ గా తీసేవాడు. అయితే ‘అత్తారింటికి దారేది’ సినిమా నుండి త్రివిక్రమ్ తన పద్ధతి మార్చుకుని ఆమూవీని 6 నెలలలోనే పూర్తి చేసాడు. గత ఏడాది వచ్చిన ‘అరవింద సమేత’ ను కూడ త్రివిక్రమ్ ఐదు నెలలలో పూర్తి చేసాడు. ఇలాంటి పరిస్థుతులలో త్రివిక్రమ్ ఆలస్యం చేయకుండా బన్నీ ఈ వ్యూహాత్మక టార్గెట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా ముగించిన వెంటనే సుకుమార్ చిత్రాన్ని ఆగష్టు నుండి మొదలు పెట్టాలని బన్నీ ఆలోచన అంటున్నారు. అయితే ఇప్పటికే అనేక షాక్ ల మధ్య ఉన్న త్రివిక్రమ్ ఎంతవరకు అల్లు అర్జున్ తనకు ఇచ్చిన టార్గెట్ లో ఈసినిమాను పూర్తి చేయగలుగుతాడు అన్న విషయమై చాలామందికి సందేహాలు ఉన్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: