మహేష్ అనీల్ రావిపూడిల మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడంతో ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వెర్షన్ రెడీ అవుతోంది. ఈపనులు చూస్తూనే అనీల్ రావిపూడి ఈమూవీకి సంబంధించిన కీలక నటీనటుల ఎంపికతో పాటు హీరోయిన్ ఎంపిక విషయమై జరుపుతున్న అన్వేషణలో అనీల్ రావిపూడికి ఊహించని షాక్ తగులుతోంది.
మహేష్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న అనిల్ రావిపూడి వ్యూహాలు !
ఇప్పటికే ఈమూవీలో నటించే విషయంలో సాయి పల్లవి నో చెప్పడంతో అనీల్ రావిపూడి దృష్టి రష్మిక వైపు వెళ్లి ఆమెకు కథ చెప్పే విషయం వరకు ఈవ్యవహారం నడిచింది. రష్మిక మహేష్ తో నటించడానికి ఇష్టపడుతున్నా ఈకాంబినేషన్ విషయమై మహేష్ కు కొన్ని సందేహాలు వచ్చినట్లు సమాచారం. దీనితో తనకు వచ్చిన సందేహాలను మహేష్ అనీల్ రావిపూడి దృష్టికి తీసుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి మహేష్ ఇప్పటి వరకు నటించిన హీరోయిన్స్ అంతా టాప్ హీరోయిన్ రేంజ్ అందుకున్న తరువాత మాత్రమే మహేష్ తో నటించారు. కాజల్ సమంత శృతిహాసన్ రకుల్ ప్రీత్ కియారా అద్వాని ఇలా అందరూ మహేష్ తో నటించే సమయానికే టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయిన హీరోయిన్స్. అయితే ఇప్పటి వరకు రష్మిక టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలతో నటించని నేపధ్యంలో తనతో రష్మిక కాంబినేషన్ ఎంత వరకు బాగుంటుంది అన్న విషయమై మరొకసారి ఆలోచనలు చేయమని మహేష్ అనీల్ రావిపూడికి సలహా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
Sonakshi Sinha.
దీనితో రష్మిక విషయాన్ని పెండింగ్ లో ఉంచి బాలీవుడ్ లో మహేష్ కు సరిపోయే హీరోయిన్ కోసం అన్వేషణ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మహేష్ తో నటించడానికి ఇష్టపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమెకు క్రేజ్ తగ్గిన నేపధ్యంలో ఆమె లేటెస్ట్ గా చాల సన్నపడి నాజూకుగా తయారైన నేపధ్యంలో ఆమె మహేష్ పక్కన నటిస్తే ఎలా ఉంటుంది అన్న అభిప్రాయ సేకరణ చేసే పనిలో అనీల్ రావిపూడి బిజీగా ఉన్నట్లు టాక్. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి ఇప్పటికే సాయి పల్లవి అదేవిధంగా కన్నడ హీరో ఉపేంద్ర రకరకాల కారణాలతో మహేష్ మూవీని రిజక్ట్ చేస్తున్న పరిస్థుతులలో మహేష్ అనీల్ రావిపూడిల సినిమాకు ఈ స్టార్టింగ్ కష్టాలు ఏమిటి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: