సీనీ ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’.  ఒకప్పుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ‘భారతీయుడు’సూపర్ హిట్ అయ్యింది.  లంచగొండి తనంపై వచ్చిన ఈ చిత్రం ఎంతో మందిలో ఆలోచన రేకెత్తించింది.  చాలా కాలం తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘భారతీయుడు2’చిత్రం తీస్తున్నట్లు ప్రకటించారు.  దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు.  లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. 
Image result for indian movie 2
కానీ ఈ చిత్రం మొదటి నుంచి రక రకాల వివాదాల్లో చిక్కుకుంటూ వస్తుంది.  శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 చిత్రానికి భారీగా బడ్జెట్ కేటాయించారని..అయితే ఆ రేంజ్ బడ్జెట్ కేటాయించడం కష్టమని నిర్మాతలు తేల్చి చెప్పడంతో శంకర్ హర్ట్ అయ్యారని..అందుకోసమే ఈ సినిమా కొంత గ్యాప్ వచ్చిందని రూమర్లు వచ్చాయి. 
Image result for indian movie 2
కానీ అసలు కారణం అది కాదట .. ప్రస్తుతం తన రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కమల్ తీరికలేకుండా ఉన్నారట. ఎన్నికలు పూర్తయిన తరువాత షూటింగు పెట్టుకోవలసిందిగా ఆయన కోరడంతో, దర్శక నిర్మాతలు ఆ తరువాతనే 3వ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: