బెంగుళూరులో స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సూపర్’సినిమా ద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది.   విక్రమార్కుడు, లక్ష్యం వంటి విజయవంతమైన సినిమాల ద్వారా తెలుగు చిత్రరంగంలో స్టార్ హీరోయిన్ గా  తన స్థానాన్ని పదిలపరచుకున్నది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకు వెళ్లి నెంబర్ వన్ పొజీషన్ చేరుకుంది. మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు.
Image result for anushka shetty
కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని ముద్దుగా పిలుస్తారు.  ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు తమ నటనతో ఎలా ఆకట్టుకున్నారు..తన హావభావాలతో అనుష్క ఆకట్టుకుంది. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నేచర్ తో విభిన్నమైన పాత్రల్లో నటించింది.  గ్లామ‌ర్ పాత్ర‌ల‌లోను అటు ధీర‌త్వం ప్ర‌ద‌ర్శించే పాత్ర‌ల‌లోను న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది అనుష్క‌.
Image result for anushka shetty
అరుంధ‌తిలో జేజెమ్మ‌గా న‌టించి జేజేలు ప‌లికించుకున్న అనుష్క బాహుబ‌లి చిత్రంలో డీ గ్లామ‌ర్ లుక్‌లో దేవ‌సేన‌గాను ఆక‌ట్టుకుంది. బాహుబలి 2 తర్వాత  చివ‌రిగా భాగ‌మ‌తి అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన అనుష్క ప్ర‌స్తుతం సైలెన్స్ అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. అనుష్క ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 14 సంవ‌త్స‌రాలు పూర్తైన సంద‌ర్బంగా ఆమె తొలి రోజుల‌ని గుర్తు చేసుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Image result for anushka shetty super movie
కెమెరాని ఫేస్ చేసి నిన్నటితో 14 సంవ‌త్స‌రాలు కావ‌డంతో ఆ ఇంట‌ర్వ్యూ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. కెమెరా ముందుకు వ‌చ్చి 14 ఏళ్ళు అవుతుంది. నా కోసం ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయించి న‌న్ను ఈ స్థానంలో నిలిపిన వారికి, నాగార్జున గారికి, పూరీ జ‌గ‌న్నాథ్ గారికి మ‌రియు నా అభిమానులు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ వీడియోలో తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: