నాచురల్ స్టార్ నాని హీరోగా ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా 50 కోట్ల పైగా బిజినెస్ జరిగింది. త్వరలో తెరకెక్కే ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాకు మంచి బడ్జెట్ కేటాయిస్తున్నారట. ఇది కాకుండా నానితో బడా నిర్మాత ఒకరు భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారట.


ఆ సినిమా డీటైల్స్ తెలియలేదు కాని నాని కెరియర్ లో ఇప్పటివరకు పెట్టని బడ్జెట్ ఆ సినిమాలో పెడుతున్నారట. అయితే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు సినిమా స్క్రిప్ట్ కూడా అదిరిపోయేలా ఉంటుందట. అందుకే నాని కూడా అందుకు ఓకే అన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి రావు హైదరి సెలెక్ట్ అయ్యిందట.


అయితే దర్శకుడు ఎవరన్న్నది మాత్రం తెలియలేదు. స్టార్ డైరక్టర్స్ లో ఒకరు ఈ సినిమా చేస్తారని అంటున్నారు. జెర్సీ రిలీజ్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేస్తున్నాడు నాని. ఆ సినిమాలో సుధీర్ బాబు కూడా స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. నాని, మోహనకృష్ణ ఇద్దరు కలిసి అష్టా చమ్మ, జెంటిల్ మన్ సినిమా చేశారు. రెండు సినిమాలు హిట్ అయ్యాయి.


ఇక ఇప్పుడు నాని భారీ బడ్జెట్ మూవీ ఏంటన్నది ఆడియెన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రెండు సినిమాలు నిరాశపరచాయి అందుకే నాని ఇక నుండి కథల మీద మరింత ఫోకస్ పెడుతున్నాడు. తప్పకుండా నానికి కరెక్ట్ సినిమా పడితే దుమ్ముదులిపేయడం ఖాయమని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: