టాలీవుడ్ సినీ నటుడు నాగార్జునకు ... పీఎం నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నాగార్జున ఓ వైవు రెగ్యులర్ గా కథా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. సేమ్ టైమ్ నాగచైతన్య - అఖిల్ స్క్రిప్టుల విషయంలోనూ కింగ్ కసరత్తు సీరియస్ గానే సాగుతోందట. ఇంత బిజీలో ఉన్న ఆయనకు డైరెక్టుగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ట్వీట్ రావడం షాక్ నిచ్చిందట. 

Image result for nagarjuna and modi

ప్రధాని నరేంద్ర మోదీ నాగార్జునకు ఏమని ట్వీట్ చేశారు? అంటే... ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా... అందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను చైతన్య పరచాలని ఆయనకు మోదీ సూచించారు. ఈ ట్వీట్ కేవలం కింగ్ నాగార్జునకు మాత్రమే కాదు సినీ -రాజకీయ ప్రముఖులు - పారిశ్రామిక వేత్తలకు పీఎంవో నుంచి వచ్చిందని తెలుస్తోంది. ``కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానం పొందారు.

Image result for nagarjuna and modi

అవార్డులు సొంతం చేసుకున్నారు. అత్యధికంగా అభిమానుల్లో ఫాలోయింగ్ ఉన్న మీరు.. ఈ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను`` అని మోదీ తన ట్వీట్లో నాగార్జునను అభ్యర్థించడం ఆసక్తికరం. సామాజిక కార్యక్రమాలకు నేను సైతం అంటూ ముందుకు వచ్చే  నాగార్జున ఈ ట్వీట్ విషయంలో ఎలాంటి రిప్లయ్ ఇస్తారో చూడాలి. ఇదే తరహా ట్వీట్ రిక్వస్ట్ ని మోహన్ లాల్ - అనుష్క - రణవీర్ - దీపిక వంటి స్టార్లకు ప్రధాని మోదీ పంపించారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: