తెలుగు ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు పృథ్వీరాజ్.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కెరియర్ పరంగా తాను బ్రేక్ తీసుకోవడానికి గల కారణాలను గురించి వివరించారు. పెళ్లి చిత్రం తర్వాత తనకు పెద్దగా ఛాన్సులు రాలేదు..దానికి కారణం తనకు తెలుగు భాష రాకపోవడమే.  ఈ విషయం తెలుసుకున్న నేను ఇక్కడ భాషపై దృష్టి పెట్టాను.  ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఛాన్సులు వచ్చాయి. అప్పట్లో నెగిటీవ్ పాత్రలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

ఇండస్ట్రీకి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు దూరంగా ఉంటూ వచ్చానని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని అన్నారు.  గతంలో హీరోలతో నటించిన కొన్ని సన్నివేశాల్లో నేను డామినేట్ చేస్తున్నట్టుగా అనుకుని, అందుకు సంబంధించిన సీన్స్ ను తీయించేసేవాళ్లు. అలా చాలాసార్లు జరుగుతూ వచ్చాయి. దాంతో నాకు చిత్రాల్లో నటించాలన్న కోరిక పోయింది.  సీతారామయ్య గారి మనవరాలు  చిత్రంలో తొలి అవకాశం వచ్చింది. 'మీనా'కు కూడా హీరోయిన్ గా తొలి చిత్రం. 

షూటింగు మొదలుకావడానికి కొన్ని రోజులముందు దర్శకుడు క్రాంతికుమార్ కనిపిస్తే, 'నీ గెడ్డం బాగుందయ్యా అన్నారు. ఏం చేయమంటారు సార్..నాకు షూటింగ్స్ లేవు అందుకే గెడ్డం పెంచానని అన్నాను.  ఫస్టు డే నేను సెట్లోకి అడుగుపెడుతుండగానే క్రాంతికుమార్  చూసి .. 'గెటవుట్ .. యు రాస్కెల్' అంటూ అరిచారు..దాంతో నేను షాక్ కి గురయ్యాను..అయితే నన్ను కాదనుకొని ఎవరిని సార్ అని మళ్లీ అడిగాను. నిన్నే .. రాస్కెల్ .. నిన్ను ఎవరు గెడ్డం తీయమన్నారు? అన్నారు.  అవసరమైతే గెడ్డం పెట్టుకోవచ్చు సార్  అన్నాను.  కానీ ఆయన నా మాట వినలేదు..అలా నాకు ఓ మంచి చిత్రం మిస్సయ్యిందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: